నన్ను దేవుడే పంపాడు..ఎవరినీ నిరాశ పరచదలచుకోలేదన్న ప్రధాని మోదీ….

ప్రధాని మోదీ అంటే ఒక మిషన్. ఆయన ఒక పని చేపట్టారంటే అవి పూర్తయ్యే వరకు నిద్రపోరు. ప్రజల కోసమే శ్వాసిస్తారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవిస్తారు. అనవసరమైన చర్యలకు దూరంగా ఉంటారు. సద్విమర్శలను స్వీకరించి దిద్దుబాటు చర్యలకు సైతం వెనుకాడరు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు జూన్ 1న చివరి దశ నిర్వహిస్తున్న వేళ..ఆయన మిడియా ఇంటర్వ్యూలను కొనసాగిస్తున్నారు. ఎక్కడిక్కడ తన మనసులోని మాటను, ప్రజలకు తాను చేయాలనుకున్న ప్రత్యేక కార్యక్రమాలను వివరిస్తున్నారు…

విశ్వసించిన వారికి మేలు చేయాలి…

నరేంద్రమోదీ మోదీ మూడో సారి ప్రధాని కాబోతున్నారు. పదేళ్ల పాటు సమర్థంగా పాలించిన ఆయన హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక లక్ష్యం కోసం తాను ప్రధాని పదివిని చేపట్టానని, అది పూర్తయ్యే వరకు విశ్రమించేది లేదని ఆయన అంటున్నారు. తనను నమ్ముకున్న వారిని డిస్సపాయింట్ చేసే ప్రసక్తే లేదన్నారు. ప్రత్యర్థులు తనను అనకూడని మాటలు అన్నప్పటికీ పట్టించుకునే ప్రసక్తే లేదన్నారు. తిట్లను పక్కన పెట్టి ప్రజా సంక్షేమానికి పనిచేస్తున్నానని చెప్పుకున్నారు. కొందరు తనను విమర్శించే వీలుందన్నారు. పరమాత్ముడే తనను పంపించాడని అనుకుంటానన్నారు.దేవుడు తనకు అప్పగించిన పనని పూర్తిచేస్తానన్నారు. అందుకే తాను పూర్తి స్థాయిలో దేవుడికి అంకితమయ్యానని మోదీ చెప్పుకున్నారు..

ప్రత్యర్థులే, శత్రువులు కాదు…

దేవుడు తనకు మార్గదర్శకంగా ఉంటారని మోదీ చెబుతున్నారు. దేవుడు తనతో డైరెక్టుగా మాట్లాడరని, ఆయన ఆదేశాలు తనకు అర్థమై దాని ప్రకారం పనిచేస్తానని ఆయన అంటున్నారు. నేను దేవుడికి డైరెక్టుగా డయల్ చేయలేను, ఆయన అనుకున్నవి తనకు అర్థమై, అన్ని పనులు చేపడుతుంటాను..అని మోదీ వివరించారు. మోదీ ఎవరినీ శత్రువులుగా చూడరు. విపక్షాలు కూడా తనకు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని ఆయన చెబుతున్నారు. దేశాన్ని ముందుకు నడిపించేందుకు తాను విపక్ష నేతలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని మోదీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. వాళ్లని సవాలు చేసి రచ్చకు ఈడ్చడం తనకు అలవాటు లేదని, తన ఉద్దేశం కూడా అది కాదని ఆయన కుండబద్దలు కొట్టారు.తను ఎవరినీ తక్కువగా అంచనా వేయనని చెబుతున్నారు…

21 శతాబ్దం చట్టాలు అవసరం…

దేశం కొన్ని విషయాల్లో ఇంకా వెనుకబడి ఉందని అందులో చట్టం, న్యాయం కూడా ఒకటని మోదీ గుర్తుచేస్తున్నారు. పాత వాసనలు, పాత ఆలోచనా విధానాలు పోవాలని ఆయన ప్రస్తావించారు. 18వ శతాబ్దంలోని చట్టాల ద్వారానే ఇంకా 21వ శతాబ్దంలో వ్యవస్థలు నడుస్తున్నాయన్నారు. సంస్కరించాలి, పనిచేయాలి, మార్పు తీసుకురావాలి (రిఫార్మ్, పెర్ఫార్మ్, టాన్స్ ఫార్మ్) అని ఆయన అంటున్నారు. అందుకే క్రమంగా చట్టాల్లో మార్పులు వస్తాయని ఆయన ప్రకటించారు….