శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ ఆకుకూర తినండి!

ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదినే సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ ఆకుకూర తింటే ఎలాంటి సమస్యలు తగ్గుతాయో తెలుసుకోవడం అవసరం. బలహీనంగా అనిపించడం, తల తిరగడం , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు బచ్చలి కూర తీంటే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

బచ్చలి కూరలో కెలరీలు తక్కువగా ఉండడంతో పాటూ శరీరానికి అనేక విధాలుగా మేలు చేసే పోషకాలతో నిండి ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను కాపాడంతో పాటూ సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా శరీరానికి రక్షణగా నిలవడం, గుండెకు సహాయం చేయడం సహా ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి.

ఆకలిని తగ్గిస్తుంది
బచ్చలికూరలో అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, ఇనుము,విటమిన్ ఎ, విటమిన్ సి,బీటాకెరాటిన్ విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. ఇవి ఆకలిని అరికడతాయి. ఇందులో ఉండే థైలాకోయిడ్ పదార్దాలు ఆకలిని తగ్గించటంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది ఆకలి హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది. కడుపు నిండిన అనుభూతిని కలిగించే హార్మోన్లను పెంచుతుంది.

ఎముకల దృఢత్వం
బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో బచ్చలికూర సహాయపడుతుంది. బచ్చలికూరలో కాల్షియం, మాంగనీస్, విటమిన్ కె ఉన్నాయి, ఇవి ఎముకల ఆరోగ్యానికి సహకరిస్తాయి, ఎముకలు బలహీనపడటాన్ని, విరిగిపోవటాన్ని నిరోధిస్తాయి.

శ్వాస సమస్యలను తగ్గిస్తుంది
బలహీనంగా అనిపించడం, తల తిరగడం , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిన వారు బచ్చలి కూర తినటం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. బచ్చలికూర రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇచ్చే విటమిన్ E మరియు మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ వ్యాధిని కలిగించే వైరస్‌లు మరియు బ్యాక్టీరియా నుంచి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.

చెడు కొవ్వు తగ్గిస్తుంది
బచ్చలి కూర శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి, మంచి కొవ్వును పెంచుతుంది. ఊపిరి తిత్తులకు బచ్చలి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో సెలీనియం, నియాసిన్ , ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండటం వల్ల మెదడు, నరాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.చర్మం మృదువుగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

గర్భిణులకు మంచిది
గర్భిణులు బచ్చలికూర తీసుకోవటం వల్ల విటమిన్ B6 అందుతుంది. శిశువు మెదడు అభివృద్ధి చెందడానికి బచ్చలి కీలకంగా ఉపయోగపడుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.