జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించారు. పవర్ స్టార్ గా ఆయనకు ఉన్న స్టార్ డమ్ స్థాయిలో జనాలు వస్తున్నారా.. వస్తున్న వారంతా ఓట్లు వేస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే … అసలు పవన్ కల్యాణ్ మాటల్లో నిలకడ అనేది లేకపోవడం.. జనసేన క్యాడర్ ను కూడా గందరగోళానికి గురి చేస్తోంది.
ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా – సీఎంను చేయాలని వేడుకోలు
తనను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేసేందుకు గత ఎన్నికల్లో చాలా కుట్రలు చేశారని.. ఈ సారి మాత్రం అడుగుపెట్టి తీరుతానన్నారు. సీఎం సీటుపై ఆలోచన లేదన్నారు. కానీ పిఠాపురం వచ్చేసరికి ఆయన మాట మారిపోయింది. సీఎం చేయాలని అభ్యర్థిస్తున్నానన్నారు. పొత్తులు ఉంటాయో లేదో చెప్పలేనన్నారు. రాజకీయాలు చేయాలంటే ఎన్నికలపై అవగాహన ఉండాలి. కానీ పవన్ కు అదే లేదు. నామినేషన్ వేస్తే చాలు ఓట్లు గుద్దేస్తారనుకుంటారన్న విమర్శలు ఈ మాటల కారణంగానే వస్తున్నాయి.
ఓటమి తర్వాత పవన్ ఏ నియోజకవర్గంపైనైనా దృష్టిపెట్టారా ?
ఎమ్మెల్యేగా అడుగుపెట్టితీరుతానన్న పవన్ రెండు చోట్ల పోటీ చేసి.. రెండు చోట్లా ఓడిపోయాు. ఆ రెండు నియోజవకర్గాలను మళ్లీ పట్టించుకోలేదు. 2014 లో తెలుగుదేశం-బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పవన్ తాను మాత్రం సీట్లు తీసుకోకుండా ఉండిపోయారు. అప్పుడే కొన్ని సీట్లు తీసుకుంటే కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు ఉండేవారు. తర్వాత ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బీఎస్పీతో వర్కవుట్ కాకపోవడంతో వెంటనే బీజేపీ దగ్గరకు వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పుడు బీజేపీకి దూరంగా .. ఓట్ల చీలనివ్వబోం కానీ సీఎం పోస్టు కావాలని రాజకీయం చేస్తున్నారు. అదే మాట మీద ఉన్నారా అంటే అదీ లేదు.
కులముద్ర వేసుకునే ప్రయత్నం రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడం కాదా ?
కర్ణాటకలో జేడీఎస్ లా అవుదామని ఎవరైనా బ్రెయిన్ వాష్ చేశారేమో కానీ ఇప్పడు కాపు కుల ముద్ర తనపై వేసుకునేందుకు పవన్ సిద్దమవడం కొత్త ఉత్పాతం. ఓ రాష్ట్ర స్థాయి నేతగా ఓ కుల ముద్ర వేసుకునేందుకు పవన్ సిద్ధంగా లేరు. కానీ ప్రాక్టికల్ గా సాధ్యం కాని సమూహాలు కలవాలని ఆయన చెబుతున్నారు. ఇక్కడా క్లారిటీ ఉండదు. ఏ కులం మీటింగ్ పెడితే ఆ కులానికి అధికారం రావాలంటారు. ఎలా చూసినా పవన్ కల్యాణ్ తన పార్టీని ముందుకు తీసుకెళ్లడం లేదు.. వెనక్కి లాగుతున్నారు. అది ఎప్పటికప్పుడు విచిత్రంగా సాగుతూనే ఉంది. ఎన్నికలకు ముందు కూడా పార్టీని ఇలా సందిగ్ధంలోనే ఉంచడం కచ్చితంగా లోపమే. జనసేనలోనే రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పవన్ ఇలా నిలకడ లేకుండా మాట్లాడటం వల్లనే. . రానురాను ఆ పార్టీని జనం సీరియస్ గా తీసుకోవడం మానేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.