మూడో సారి పవన్ కల్యాణ్ విడాకులు – జాతీయ మీడియాలోనూ విస్తృత ప్రచారం !

ప్రజా జీవితంలో ఉన్న పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన తన మూడో భార్య , రష్యా కు చెందిన అన్నా లెజ్ నోవాతోనూ విడిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై జాతీయ మీడియా కూడా విస్తృతంగా కథనాలు రాస్తోంది. అయితే పవన్ కల్యాణ్ వైపు నుంచి కానీ మెగా కుటుంబం వైపు నుంచి కానీ ఇంకా ఎటువంటి ప్రకటనలు రాలేదు. జాతీయ మీడియాలోనూ ప్రచారం జరుగుతూండటంతో నిజమేనని ఎక్కువ మంది భావిస్తున్నారు.

పవన్ పై పెళ్లిళ్ల విమర్శలు చేస్తున్న వైసీపీ

ప్రజాజీవితంలో ఉండాలంటే సరైన వ్యక్తిత్వం ఉండాలని… భార్యలను అదే పనిగా మార్చే పవన్ కు అది లేదని.. వైసీపీ నేతలు ఇటీవలి కాలంలో తరచూ విమర్శిస్తున్నారు. ఇప్పుడు వారు తమ విమర్శల దాడి మరింత పెంచే అవకాశాలను పవన్ కల్పించినట్లుగా ఉన్నారు. పవన్ కల్యాణ్,, ఆయన మూడో భార్య అన్నా లెజ్‌నోవా విడిపోయారని జాతీయ మీడియా చెబుతోంది. అన్నా లెజ్‌నోవా ఇటీవలి కాలంలో అసలు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆమె కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా ఫోటోలు కూడా బయటకు రావడం లేదు. అందుకే ఆమె విడిపోయారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.

చాలా కాలంగా విదేశాల్లోనే ఉంటున్న అన్నా లెజ్ నోవా

పిల్లల చదువుల కోసం లెజ్ నోవా చాలా కాలంగా విదేశాల్లో ఉంటున్నారు. పిల్లల్ని సింగపూర్‌లో చదివిస్తున్నారన్న ప్రచారం ఉంది. సెలబ్రిటీ పిల్లలుగా ఎక్కువ ఫోకస్ పడకుండా అందరిలాగే పెంచాలన్న ఉద్దేశంతో వీలైనంత వరకూ మీడియా కు దూరంగా ఉంటున్నారుని మెగా ఫ్యామిలీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని కుటుంబపరమైన కార్యక్రమాలకూ పవన్ కల్యాణ్ కూడా వెళ్లరన్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్‌తో నిజంగానే విడిపోయారా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. దీనిపై ఇంకా మెగా కుటుంబం ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఎన్నికలకు ముందు పవన్ ఇలా చేస్తారా ?

నిజానికి ఇది కుటుంబపరమైన విషయం. దీనిపై వారు అధికారికంగా వారు ప్రకటించేదాకా ఇలా ప్రచారం చేయలేదు.. ఖచ్చితమైన సోర్స్ ఉంటేనే ప్రచారం చేయవచ్చని అనుకుంటున్నారు ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన కుటుంబపరమైన విషయాలను మరింత కేర్ ఫుల్ గా డీల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆయన వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత జీవితాన్ని రాజకీయం టార్గెట్ చేసుకుంటుంది. దీనిపై పవన్ , లెజ్ నోవా స్పందించి పుల్ స్టాప్ పెట్టకపోతే రాజకీయంంగానూ పవన్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.