జేపీ నడ్డాతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ కామెంట్స్

జనసేన పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు…..

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఢిల్లీలోని ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జి మురళీధరన్ నివాసంలో మంగళవారం రాత్రి ఈ భేటీ జరిగింది. ఈ సమావేశం అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్’ దిశగా జనసేన అజెండా ఉందని చెప్పారు. బీజేపీది కూడా అదే అజెండా అని పేర్కొన్నారు. వైసీపీ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఎలా విముక్తి కల్పించాలి అన్న దిశగా చర్చించామని వెల్లడించారు.