చంద్రబాబు ట్రాప్‌లో పవన్ – ఇరవైలోపే జనసేనకు సీట్లు ?

చంద్రబాబు ట్రాప్ లో పవన్ పడిపోయినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్ని సీట్లని కాదు.. గెలిచే సీట్లలోనే పోటీ చేస్తామని పవన్ చేసిన ప్రకటనపై జనసేన వర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది . గెలిచే సీట్లు.. ఓడిపోయే సీట్లు అనుకుంటే.. ఇక పోటీ చేయడం ఎందుకన్న వాదన వినిపిస్తోంది. గెలుపు ఎప్పుడూ ప్రజల చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ పేరుతో పవన్ ట్రాప్‌లో పడిపోవడం ఆశ్చర్యకరంగా మారిందన్న వాదన వినిపిస్తోంది.

చంద్రబాబు 28 సీట్లు అంటే చివరికి చేతికి వచ్చేది 20 కంటే తక్కువే

చంద్రబాబుతో పొత్తులు ఎలా ఉంటాయో.. పొత్తులు పెట్టుకున్న పార్టీలకు అనుభవనే.. పొత్తుల రాజకీయాలు చూసిన సాధారణ జనానికి ఇంకా అనుభవమే. చంద్రబాబు ఇరవై ఎనిమిది సీట్లు కేటాయించారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కానీ.. . అధికారిక నెంబర్ ఇదే అయినా నామినేషన్లు పూర్తయ్యే సరికి ఆ సంఖ్య ఇరవైకి చేరుతుంది. బలమైన అభ్యర్థులు లేరని… పార్టీ నేతలు ఒప్పుకోవడం లేదని చెప్పి బీఫాంలు ఇచ్చి మరీ పోటీలోకి దింపేస్తారు చంద్రబాబు నాయుడు. అప్పుడు చేయడానికి జనసేనానికి చేతిలో సమయం ఉండదు.

కేటాయించే సీట్లలో ఓడించే ప్రయత్నాలు కూడా చేస్తారా ?

గతంలో టీఆర్ఎస్ పార్టీ చంద్రబాబుతో పొత్తులు పెట్టుకుంది. ఆ పార్టీకి తెలంగాణలో నలభై సీట్ల వరకూ కేటాయించారు. కానీ పది సీట్లలోనే గెలిచారు. టీడీపీ మద్దతుదారులు ఏ మాత్రం పార్టీకి పని చేయలేదని .. తమ పార్టీని బొంద పెట్టేందుకు కుట్ర చేశారని కేసీఆర్ కు అర్థమయింది. అప్పట్నుంచే చంద్రబాబుపై కోపం పెంచుకున్నారని చెబుతారు. చంద్రబాబు పొత్తులు పెట్టుకుని చేసే రాజకీయాల్లో.. మిత్రపక్షాల్ని నిర్వీర్యం చేయడం కూడా ఒకటి అని ఎక్కువ మంది నమ్ముతారు. ప్రస్తుతం బీజేపీ దుస్థితికి కూడా చంద్రబాబుతో పొత్తులే కారణమని చెప్పేవారున్నారు.

పవన్ చంద్రబాబు రాజకీయాల్ని గుర్తించలేకపోతున్నారా ?

పవన్ కు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన ఫాలో యింగ్ ఉంది. అయినా ఇరవై సీట్లకు పరిమితమవడం అంటే.. ఆయన తనను తాను పూర్తిగా తగ్గించుకోవడమే. సీట్లు ఇచ్చినా రాకపోయినా.. పవన్ బలంగా ఉండాలంటే.. ఎప్పటికైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో ఉండాలంటే.. బీజేపీతో కలిసి పోటీ చేయడమే మేలన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. కానీ పవన్ ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు ట్రాప్‌లో ఉన్నాడన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.