తెలుగు రాష్ట్రాల్లో ” అసలైన వారసుని ” కొత్త రాజకీయ పార్టీ !?

తెలుగు రాష్ట్రాల రాజకీయంలో త్వరలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అసలైన వారసుడు తన రాజకీయ ఎంట్రీ కోసం పూర్తి స్థాయిలో సన్నాహాలు అతి గుంభనంగా చేసుకుంటున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అది ఎవరి పార్టీనో కాదు . జూనియర్ ఎన్టీఆర్ ది. ఎన్టీఆర్ కు రాజకీయాలపై అమితమైన ఆసక్తి ఉంది. అదే సమయంలో ఆయనకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయడానికి తెలుగుదేశం పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నదానిపైనా ఆయనకు అవగాహనకు ఉంది. అందుకే అన్నింటకీ చెక్ పెట్టేలా ఆయన అసలు స్కెచ్ వేయబోతున్నారని అంటున్నారు.

అసలైన వారసుడి అసరైన తెలుగుదేశం రాబోతోందా ?

ఉమ్మడి రాష్ట్ర రాజకీయంలో ఎన్టీఆర్ పాత్ర కీలకం. ఆయన వారసత్వంపై ఇప్పటికీ అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు ఆయన వారసుడు కాదని .. ఆయన పిల్లలు ఎవరూ ఆ స్థాయి సామర్థ్యం లో లేరన్న విశ్లేషణలు ఇప్పటికీ వచ్చాయి. ఎన్టీఆర్ వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ నిలబెట్టరలరన్న అభిప్రాయమూ ఉంది. నటనా రంగంలో ఆ స్థాయిని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయంపైనా ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. అసలైన వారసుడ్నన్న ట్యాగ్‌తో ఆయన రాజకీయ పార్టీ ప్రారంభించాన్న ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. దీనికి సంబంధించి కొంత మంది సన్నిహితులతో కసరత్తు కూడా చేస్తున్నారని చెబుతున్నారు.

టీడీపీతో మాత్రమే టచ్ మీ నాట్.. మిగతా రాజకయాలపై ఎన్టీఆర్ ఆసక్తి !

ఇటీవలి కాలంలో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారాలను పరిశీలిస్తే ఆయన తెలుగుదేశం పార్టీకి.. మాత్రమే దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీకి దగ్గర అన్నట్లుగా ప్రచారం జరుగుతుందని భావిస్తే.. ఎలాంటి వాటికీ స్పందించడం లేదు. తప్పనిసరిగా స్పందించాల్సిన విషయాల్లో పొలైట్ గా స్పందించారు. ఆయన స్పందనపై టీడీపీ శ్రేణులు కూడా విమర్శలు గుప్పించాయి. అేద సమయంలో అమిత్ షాతో భేటీకి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఆ భేటీలో రాజకీయ చర్చలు జరిగాయా లేదా అన్న విషయం పక్కన పెడితే.. అలాంటి చర్చ బయట విస్తృతంగా జరుగుతుందని తెలిసి కూడా ఆయన అమిత్ షాతో భేటీకి ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హాజరయ్యేందుకు అంగీకరించారు. అది బీఆర్ఎస్ నేతృత్వంలో అంటే.. రాజకీయ పరంగనే జరగనుంది. తనపైరాజకీయ ముద్ర పడకూడదనుకుంటే.. ఇలాంటి వాటికి ఎన్టీఆర్ దూరంగా ఉండేవారు. పడినా పర్వాలేదనుకుంటే టీడీపీ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఎన్టీఆర్ మాత్రం.. టీడీపీకి దూరంగా.. ఇతర రాజకీయాలకు దగ్గరగా ఉంటున్నారు. ఇక్కడే ఆయన ఉద్దేశం స్పష్టమవుతోందని అంటున్నారు.

ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే రాజకీయాలు ఎలా మారుతాయి ?

ఎన్టీఆర్ మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి. గతంలో రాజకీయ ప్రచారం ఎలా చేశారో చూశాం. ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెడితే సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. తానే అసలైన వారసుడ్నన్న వాదన తీసుకు వస్తే .. ప్రజల మద్దతు పొందగిలితే.. అసలైన తెలుగుదేశం పార్టీగా జూనియర్ పార్టీనే నిలబడే అవకాశం ఉంది. అధికారం..బలం ఎవరి వైపు ఉంటే.. నేతలంతా అటు వైపు వస్తారు. అందుకే జూనియర్ పార్టీ పై ఆసక్తి పెరుగుతోంది. జూనియర్ కొత్త పార్టీపై ఆలోచన చేస్తున్నారా.. చేస్తే ఎప్పుడు అన్నదానిపై క్లారిటీ రావడానికి.. మరికొన్ని వారాల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.