పుంగనూరులో పెద్దిరెడ్డికి ఎదురుందా ? చల్లా బాబు ఎదురునిలబడగలరా ?

చిత్తూరు జిల్లా పరిధిలో పుంగనూరు నియోజకవర్గం ఉన్నా అన్నమయ్య జిల్లా పరిధిలోని రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోకి వస్తుంది. పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, పులిచర్ల, రొంపిచర్ల ఆరు మండలాలు వున్నాయి. జమీందారులు ఆధిపత్యం వహించిన చరిత్ర పుంగనూరుకు వుంది. పుంగనూరు నియోజకవర్గంలో 1952 నుంచి 2019 వరకు 17 సార్లు జరిగిన ఎన్నికలు ఎన్నికల్లో అత్యధికంగా45 ఏళ్ల పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే గెలుస్తున్నారు. 1985 నుంచి వరుసగా రెడ్డి సామాజివర్గం వారు ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారు.

పుంగనూరు మొదట్లో టీడీపీ కంచుకోట !

తండ్రీ కొడుకులైన ఎన్‌ రామకష్ణారెడ్డి, అమర్‌ నాథ్‌ రెడ్డిలు ప్రాతినిథ్యం వహించారు. రామకష్ణా రెడ్డి మొదట ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్‌ కొట్టగా 1985 నుండి 1996 వరసగా మూడు గెలిచారు. 1996లో చిత్తూరు పార్లమెంటు స్థానానికి టిడిపి తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. రెండోసారి 1998 మధ్యంతర ఎన్నికల్లోనూ, 1999లో ఎన్నికల్లో మూడోసారి ఎంపీగా గెలుపొంది అప్పటి చిత్తూరు జిల్లాలో తిరుగులేని నాయకుడుగా హ్యాట్రిక్‌ సాధించాడు. : 2014లో ఆవిర్భావం నుంచి జరిగిన రెండు ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ పటిష్టమైన కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు ఈ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ నుంచి వైసిపికి మారడంతో పార్టీ నియోజక వర్గంలో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నాడు

పునర్విభజనతో అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గం మార్పు

2009నుండి 2019 ఎన్నికలలో గెలిచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హ్యాట్రిక్‌ కొట్టారు. 2009 నియోజక వర్గాల పునర్విభజన వరకు టీడీపీ పూర్తి ఆధిపత్యం కొనసాగింది. ఎన్‌ రామకష్ణా రెడ్డి హ్యాట్రిక్‌ సాధించగా, ఆయన తనయుడు అమరనాథ్‌ రెడ్డి వరుసగా రెండుసార్లు గెలిచారు. అయితే నియోజక వర్గాల పునర్విభజనలో అమరనాథ్‌ రెడ్డి సొంత మండలం పెద్దపంజాణి పలమనేరు నియోజకవర్గానికి మారడంతో టీడిపి గత మూడు ఎన్నికల్లో ఓటమి చవిచూస్తోంది. టిడిపికి కేడర్‌ ఉన్నా ముందుండి నడిపించే నేత లేకపోవడంతో ప్రతిసారి విఫలమవుతోంది.అభ్యర్థుల బలాబలాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా మూడు సార్లు నెగ్గి నాలుగవ సారి కూడా గెలిచి తన ఆధిపత్యం నిరూపించుకునేందుకు సిద్ధం అయ్యారు.

కూటమి అభ్యర్థిగా చల్లా బాబు

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో పుంగనూరులో త్రిముఖ పోటీ ఏర్పడింది. అయితే వైసిపి మాత్రం అన్ని రకాల ముందంజలో ఉంది. ఎన్నికలకు అవసరమైన అన్ని సిద్ధం చేసి వైసిపి మండల నేతలు, కార్యకర్తలు అటు మండలంలోని ఇటు మున్సిపాలిటీలను కలియ తిరుగుతూ ప్రచారాన్ని ఉధతం చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో ఎదుర్కోవడానికి ఇతర పార్టీలకు ఉన్న బలాబలాలతో పోలిస్తే కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకుడు రామచంద్ర యాదవ్‌ పుంగనూరు నుంచి బరిలో దిగనున్నారు. 2019లో జనసేన తరుపున పోటీ చేసి 16వేల ఓట్లు పొందారు. వైసిపి సీనియర్‌ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించడం తో వార్తల్లో నిలిచారు.