ప్రజా నాయకుడు మోదీ ఆకాంక్ష నెరవేరబోతోంది. బీజేపీ పడిన కష్టానికి ప్రతిఫలం అందబోతోంది. ప్రధాని మోదీ నాయకత్వం మరింత పటిష్టం కాబోతోంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై దేశ ప్రజల విశ్వాసం కట్టలు తెంచుకుని ప్రవహించబోతోంది. వెరసి అధికార సంకీర్ణం మరో సారి ఘనవిజయం సాధించబోతోంది. ప్రధాని మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు…
బీజేపీకి తిరుగులేని విజయం..
న్యూస్ 18 సంస్థ నిర్వహించిన మెగా ఒపీనియన్ పోల్ ప్రకారం 543 స్థానాలున్న భారత పార్లమెంటులో బీజేపీ నేతృత్వ ఎన్డీయేకు ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో 411 స్థానాలు వస్తాయి. మోదీ చెబుతున్న 400 పార్ కంటే ఇది 11 సీట్లు ఎక్కువ. ఎన్డీయే భాగస్వాములతో సంబంధం లేకుండా బీజేపీకి మాత్రమే 350 సీట్లు వస్తున్నాయని సర్వే తేల్చడం విశేషం. ఎన్డీయే భాగస్వాములుగా ఉన్న జేడీయూ, టీడీపీ లాంటి పార్టీలన్నీ కలుపుకుని 61 స్థానాలు సాధిస్తాయని న్యూస్ 18 నిర్వహించిన పోల్స్ నిగ్గు తేల్చాయి.
హిందీ రాష్ట్రాల్లో తిరుగులేని పార్టీ…
హిందీ భాష మాట్లాడే ప్రజలున్న రాష్ట్రాల్లో బీజేపీ స్వీప్ చేయబోతోంది. ఉత్తర ప్రదేశ్లో 77, మధ్యప్రదేశ్లో 28, ఛత్తీస్ గఢ్ లో 10, బిహార్ లో 38 స్థానాలు ఆ పార్టీకి వస్తాయి. ఇక 28 స్థానాలున్న కర్ణాటకలో 25, ఒడిశాలో 13, పశ్చిమ బెంగాల్ లో 25, తెలంగాణలో 8, ఆంధ్రప్రదేశ్లో 18 సీట్లు దక్కించుకుంటుంది.
కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది…
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర నేతలు ఎన్ని డాంబికాలు పలికినా… కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్ నేతృత్వ ఇండియా గ్రూపు అతి కష్టం మీద సెంచురీ దాటి 105 దగ్గర ఆగుతోంది. అందులో కాంగ్రెస్ పార్టీకి 49 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 2014లో ఆ పార్టీకి 44 సీట్లు వచ్చాయి. 2019లో హాఫ్ సెంచురీ దాటింది. ఇక అన్నాడీఎంకే, బీఎస్పీ, బీఆర్ఎస్, బీజేడీ, వైసీపీలు కలిపి 27 సీట్లు సాధిస్తాయని. ఎన్డీయేకు దాదాపు 60 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింద… 518 లోక్ సభా నియోజకవర్గాల్లో విస్తృతంగా సర్వే నిర్వహించి విశ్లేషించిన తర్వాతే ఎన్డీయేకు 411 స్థానాలు వస్తాయని తేల్చారు. ప్రతీ లోక్ సభా నియోజకవర్గంలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లను ఎంపిక చేసి అందులో సర్వే నిర్వహించారు. 11 ప్రాంతీయ భాషల్లో ప్రశ్నావళిని రూపొందించి పౌరులు సులభంగా అర్థం చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం పది ఫీల్డ్ వర్క్ ఏజెన్సీల సేవలను వినియోగించారు. ప్రతీ ఇంటర్వ్యూను జియో ట్యాగ్ చేశారు.