MLC ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బిజెపి కి మాత్రమే ఉంది – సోమువీర్రాజు

శాసనమండలి ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బిజెపి కి మాత్రమే ఉంది రెండు ప్రాంతీయ పార్టీలకు లేదు, ప్రాంతీయ పార్టీల వల్ల అభివృద్ధి జరగలేదు అన్నారు.

అధికార పార్టీ డిగ్రీ లేని వారికి ఓటు నమోదు చేసింది ఇంత కంటే దుర్మార్గం ఉంటుందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రశ్నించారు, అభివృద్ధి కేంద్రం లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతోంది అన్నారు,
ఇక్కడ వెంకటగిరి లో కూడా అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం వల్ల జరిగింది, అభివృద్ధి విషయంలో బిజెపి చర్చ కు సిద్దంగా ఉంది రెండు పార్టీలు సిద్ధమా అని తీవ్ర స్వరంతో పిలుపు ఇచ్చారు.

రహదారులు అభివృద్ధి దగ్గర నుండి సముద్ర తీరం వరకు రకరకాల అభివృద్ధి చేశాం అన్నారు, ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది
ఎన్నికల్లో స్పష్టత ఉన్న పార్టీ బిజెపి మాత్రమే అన్నారు.