ఏపీలో బీజేపీకి మాత్రమే ఓటు అడిగే హక్కు – జనసేనతో కలిసి ప్రజాపోరు !

జనసేనతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజాపోరు చేయాలని ఏపీ బీజేపీ నిర్ణయించింది. గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పై సోమువీర్రాజు నిప్పులు చెరిగారు..ఈ ప్రభుత్వాన్ని ప్రజలముందు దోషిగా నిలబెట్టేందుకు చార్జి షీట్ వేయబోతున్నామని.. వైసీపీ అవినీతి ప్రభుత్వంమీద బిజెపి సమర శంఖం పూరిస్తోందనిప్రకటించారు. ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని స్పష్టం చేశారు.

మే5 నుంచి 13 వరకూ చార్జ్ షీట్ కు అవసరమైన అంశాల సేకరణ

ఏపీ బీజేపీ నేతలు మే5 నుంచి 13 వరకూ చార్జ్ షీట్ కు అవసరమైన అంశాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నారు. కేంద్రం ఏపీకి ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవడం లేదని సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలను ఓట్లు అడిగే హక్కు కేవలం బిజెపికి మాత్రమే ఉందని.. మనం ఎవరితోనో ఉన్నామని చాలామంది అనుకుంటున్నారని.. నరేంద్ర మోడీ వంటి దమ్మున్న నాయకుడికి ఇక్కడ ఎవరితోనో ఉండాల్సిన అవసరం లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. గ్రామీణ సడకే యోజన కింద గ్రామాల్లో రోడ్ల కోసం రూ5 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నాకుయ వైసీపీ ప్రభుత్వానికి 40 వేల కోట్లు గృహ నిర్మాణం కోసం ఇచ్చామని.. కానీ ఇళ్ల నిర్మాణం మాత్రం జరగటం లేదని మండిపడ్డారు. సర్పంచులకు రూ8 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. వాటిని కేవలం సర్పంచుల ఖాతాల్లో మాత్రమే వేస్తామని చెప్పిందని.. సర్పంచులు గ్రామాలను స్వతంత్రంగా అభివృద్ధి చేయాలని మోదీ ఆలోచన అన్నారు. ఉపాధి హామీ కోసం రూ75 వేల కోట్లు ఏపీకి ఇచ్చాని.. దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చామన్నారు.

అమరావతిలోనే రాజధాని

అమరావతి లోనే రాజధాని ఉంటుంది పార్లమెంటులో నే చెప్పామని సోము వీర్రాజు గుర్తు చేశారు. రాజధాని కోసమే ఎయిమ్స్ ఇక్కడ కట్టించాం, అమరావతికి నిధులు ఇచ్చాంమని.. వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మించని కారణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందన్నారు. హైవేలు, పై వంతెనలు అనంతపురం ఎక్స్ ప్రెస్ వే అమరావతి కోసం కాదా అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ దేశానికే కాదు రాష్ట్రానికి కూడా ఆయనే నాయకుడని సోము వీర్రాజు గుర్తు చేశారు. బిజెపితో పొత్తు కోసం ప్రయత్నిస్తూనే.. వామపక్షాలతో మాపై విమర్శలు గుప్పిస్తారని.. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై జనపోరు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం భయపడేది కేవలం బిజెపికి మాత్రమేనన్నాు. భయపడింది కాబట్టే జిన్నా టవర్ వద్ద జాతీయ పతాకం పెట్టారని.. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు నుంచి వైదొలిగిందన్నారు. విజయనగరంలో శ్రీరాముని విగ్రహం తెగ్గొడితే.. బిజెపి చేసిన నిరసనతో మళ్లీ గుడి కట్టించారని గుర్తు చేశారు. ప్రభుత్వం తప్పు చేసిన ప్రతిసారి వారిపై ఒత్తిడి తెచ్చామన్నారు. ఇసుక దోపిడి పై బిజెపి చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేరని.. రాష్ట్రంలో మరో అవినీతికరమైన ప్రతిపక్షం ఉండాలనేది జగన్ భావన అని మండిపడ్డారు.

వైసిపి మహా దొంగల పార్టీ – ఏపీకి ఓ బుల్ డోజర్ బాబా కావాలి !

ఏడాది కంటే తక్కువ కాలం మన చేతుల్లో ఉందని. గత ఎన్నికల ఫలితాలు చూసి నిరుత్సాహానికి గురికావద్దని ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇంచార్జ సునీల్ ధియోధర్ పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. ఏపిలో బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. ఏపిలో ప్రజలు మోడిని ఇష్టపడుతున్నారని.. బిజెపి నుండి పోయిన వారి గురించి మర్చిపోండి. వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలనిసూచించారు. జిన్నా టవర్ పేరు మార్పు మన అజెండాలో ఉంది. జిన్నా పట్ల జగన్ కు ఎందుకింత ప్రేమ అంటే ముస్లిం ఓట్ల కోసమే. ప్రజలు కట్టే పన్నులు పాస్టర్స్ కి ఎలా ఇస్తారు. జగన్ దళిత వ్యతిరేకి, పూలే , అంబేద్కర్ వ్యతిరేకి. రిజర్వేషన్ సీట్ల నుండి గెలిచిన వైసిపి ప్రజా ప్రతినిధులు చర్చ్ లకు వెళుతున్నరని ధియోధర్ విమర్శించారు. జగన్ హిందువులు గురించి పట్టించుకోడు. టిటిడిలో కన్వర్టెడ్ క్రిష్టియన్స్ కు ఉద్యోగాలు ఎలా ఇస్తారని సునీల్ ధియోధర్ ప్రశ్నించారు. కుట్ర చేసి తెలుగు మీడియం స్కూల్స్ ను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా మార్చారరని.. ఆర్థికంగా పతనం దిశలో ఏపి ఉందన్నారు. ఏపీకి బుల్ డోజర్ బాబా కి కావాలvdvejg. జనసేన మన మిత్ర పక్షం. జనసేన నాయకులతో కలిసి ప్రజా పోరు చేయండని ధియోధర్ పిలుపునిచ్చారు. ఏపిలో ప్రజలు మోడిని ఇష్టపడుతున్నారన్నారు.

అవినీతి , వారసత్వ పార్టీల నుంచి ఏపీకి విముక్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి, వారసత్వ రాజకీయ పార్టీలు నాశనం చేస్తున్నాయని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వాటి నుంచి ఏపీకి విముక్తి కల్పించి.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించేలా కృషి చేస్తామన్నారు.