ప్రేక్షకులకు అస్సలు నచ్చని ఆన్ స్క్రీన్ జోడీలివే!

తెరపై కొన్ని జంటల్ని చూడగానే ఎంత బావున్నారో అనిపిస్తుంది. ఆ జోడీలను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ప్రభాస్-అనుష్క, చైతూ-సమంత, రానా-కాజల్, విజయ్ దేవరకొండ-రష్మిక..ఇలా కొందరు వహ్వా అనిపిస్తారు. కానీ కొన్ని జంటల్ని చూస్తే మాత్రం ప్రేక్షకులకు చిరెత్తుకొస్తుంది. వీళ్ల మధ్య అస్సలు కెమిస్ట్రీ కుదర్లేదు అనిపిస్తుంది. అలాంటి ఆన్ స్క్రీన్ పెయిర్స్ ఇవే…

ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే సినిమా కథ, కథనం, పాటలు, డైలాగులతో పాటు హీరో, హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ చాలా ప్రధానం. అందుకే స్టోరీ-హీరో ఫైనల్ అయిన తర్వాత హీరోయిన్ ఎంపిక విషయంలో పెద్ద కసరత్తే చేస్తారు. ఈ ప్రయత్నం చాలాసార్లు సక్సెస్ అవుతుంది కానీ కొన్నిసార్లు మాత్రం ఫెయిల్ అవుతుంటాయి..అలాంటి జంటలు కొన్ని..

మహేష్ బాబు -రష్మిక
సిల్వర్ స్క్రీన్ పై అస్సలు సెట్టవని జోడీలో మహేష్ బాబు-రష్మిక. వీళ్లిద్దరూ కలసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ లో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్టైంది కానీ ఈ జోడీకి కూడా ప్రేక్షకులు అస్సలు మార్కులేయలేదు

వెంకటేష్ -పాయల్
వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం వెంకీ మామ. ఇందులో వెంకీకి జోడీగా పాయల్ కనిపించింది. అప్పటికే RX100 సినిమాతో బోల్డ్ బ్యూటీ అనిపించుకున్న పాయల్..వెనువెంటనే సీనియర్ హీరోతో అనేసరికి ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. వీళ్ల జోడీ కూడా అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి

విక్రమ్ -కీర్తి సురేష్
స్వామి 2 లో విక్రమ్ సరసన హీరోయిన్ గా నటించింది కీర్తి సురేష్. ఈ జంట కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేదు.

చిరంజీవి-త్రిష
స్టాలిన్ మూవీలో ఇద్దరూ కలసి నటించారు. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ పరంగా బావున్నప్పటికీ ఈ జోడీ మధ్య కెమిస్ట్రీ అంతగా సెట్టవలేదనే కామెంట్స్ వచ్చాయి.

అఖిల్ – నిధి అగర్వాల్
మిస్టర్ మజ్ను సినిమాలో అఖిల్ కి హీరోయిన్ గా నటించింది నిధి అగర్వాల్. ఈ స్టోరీ ఎలా ఉంది, సినిమా హిట్టా ఫట్టా పక్కనపెడితే వీళ్లిద్దరి మధ్యా కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ అవలేదు

అఖిల్-పూజా హెగ్డే
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ సినిమాలో ఈ జోడీ బావుందని ఒకర్కరంటే ఒక్కరూ అనలేదు. అఖిల్ కి పెయిర్ గా పూజా అస్సలు నప్పలేదు.. వీళ్లిద్దరి మధ్యా కెమిస్ట్రీ చూడలేకపోయాం అనే కామెంట్స్ వచ్చాయి. సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చినా జోడీ ఫెయిల్ అనే చెప్పాలి

నాగ చైతన్య- కాజల్
అప్పట్లో దడ అనే ఓ సినిమా వచ్చింది…అందులో నాగచైతన్యతో కలసి నటించింది కాజల్ అగర్వాల్. అప్పట్లో ఈ పెయిర్ పైనా కామెంట్స్ వచ్చాయి. చైతూకి కాజల్ అక్కలా ఉందంటూ ట్రోల్స్ చేశారు.

అల్లు అర్జున్-భానుశ్రీ
గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం వరుడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఇందులో కథ, కథనం మాట పక్కనపెడితే హీరోయిన్ కూడా మైనస్సే. బన్నీ-భానుశ్రీ మధ్య లవ్ ట్రాక్ ప్రేక్షకులకు అస్సలు కనెక్ట్ అవలేదు.