ఓ వైపు ఆందోళనలు – మరో వైపు మోదీ పాలనా విజయాల ప్రచారం ! హిందూపురంలో విష్ణు బహుముఖ వ్యూహం !

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఓ వైపు ప్రభుత్వంపై పోరాటం.. మరో వైపు కేంద్ర సర్కార్ విజయాల ప్రచారం చేస్తూ.. ప్రజల్లోకి . వెళ్తున్నారు. ఇంటింటికి బీజేపీని తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. దీనిపై ఆయన కార్యాచరణ ప్రారంభించారు.

ఇంటింటికి బీజేపీ విజయాల ప్రచారం

కేంద్ర ప్రభుత్వం భారత్ ను ప్రపంచశక్తిగా మారుస్తోంది. ఈ క్రమంలో అనేక విజయాలు సాధిస్తోంది. అలాగే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతోంది. ఏపీలో ఎక్కడైనా అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వ నిధులే. అయినప్పటికీ ప్రచారం మాత్రం పెద్దగా రావడం లేదు. ఈ లోపాన్ని గుర్తించిన విష్ణువర్థన్ రెడ్డి హిందూపురం పార్లమెంట్ పరిధిలో ప్రతి ఇంటికి మోదీ ప్రభుత్వ విజయాలు, రాష్ట్రంలో కేంద్రం సాయంతో జరుగుతున్న పనులు, పథకాల గురించి వివరించాలని నిర్ణయించారు. కదిరిలో మండల స్థాయి నేతలకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.

గతంలో మోదీ ప్రభుత్వ విజయాల రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో కీలకం

కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం ఏర్పడిన 9 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలపై దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం నిర్వహించింది. ఏపీలోనూ నిర్వహించారు. అది రాష్ట్ర స్థాయి కార్యక్రమం కావడంతో… కింది స్థాయి వరకూ వెళ్లలేకపోయింది. ఈ ప్రచారంలోనూ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ అనుభవంతో కింది స్థాయి ప్రజలకు కూడా మోదీ ప్రచార విజయాలను తెలియచేయాలని అనుకుంటున్నారు. అందుకే కదిరిలోనే ఎక్కువగా ఉంటూ.. కార్యాచరణ ఖరారు చేస్తున్నారు.

వచ్చే మూడు నెలల పాటు విస్త్రతంగా ప్రచారం

వచ్చే మూడు నెలల పాటు హిందూపురం పార్లమెంట్ పరిధిలో బిజేపీ కార్యక్రమాలు విస్తృతంగా జరిగేలా విష్ణువర్దన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారు. తప్పని సరిగా మీడియా కవరేజ్ ఇవ్వాలన్న స్థాయిలో వీటిని నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఆయన రాష్ట్ర స్థాయి పార్టీ కి ఎక్కువ సమయం కేటాయించేవారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో హిందూపురంలోనే ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.