నిద్రలేమితో బాధపడుతున్నారా? ఎంత ప్రయత్నించినా నిద్రరావడం లేదా? అలా అయితే మీరు అల్జీమర్స్ అదేనండి మతిమరుపుని మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టే అంటోంది ఓ అధ్యయనం…
డై టైమ్ కన్నా నైట్ టైమ్ బెటర్
ప్రతిప్రాణికి నిద్ర చాలా అవసరం. కంటినిండా నిద్రపోతే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రోజుంతా తిండి తినకుండా ఉన్నా ఏమీ కాదు కానీ సరిపడా నిద్రలేకపోతే మాత్రం అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర ఎంతో అవసరం. రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు. ఎంతసేపు నిద్రపట్టింది.. ఈ రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే నిద్రలేమితో బాధపడేవారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సరైన నిద్ర లేకుంటే.. లేచిన దగ్గర నుంచి ఆ రోజుంతా నిరసంగా అనిపిస్తుంది. ముఖ్యంగా పగటివేళ నిద్రకన్నా రాత్రి సమయంలో నిద్ర చాలా అవసరం.
నిద్రలేమితో అల్జీమర్స్
నిద్రలేమి ఎక్కువ అయితే అది అల్జిమర్స్ వ్యాధికి దారితీసే ప్రమాదం ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. కంటినిండా నిద్రపోయినవారు రోజంతా ఎంతో హుషారుగా ఉండటమే కాకుండా వారు చేసేపని కూడా ఎంతో ఆహ్లాదకర వాతావరణంతో నిండి ఉంటుంద, సరైన నిద్రలేకపోతే.. మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతిసేందుకు రెడ్ ఫ్లాగ్ పరిచినట్టేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది
చాప కింద నీరులా వ్యాపించే ఆల్జీమర్స్ వ్యాధి ప్రారంభంలో బ్రెయిన్ లో కలిగే మార్పులకు సంబంధించి లక్షణాలు పెద్దగా కనిపించవు. దశాబ్దాల తరువాత ఈ ప్రభావం కనిపిస్తుంది. మతిమరుపు రావడం, గందరగోళానికి గురికావడం, ఆలోచన శక్తి నశించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్రెయిన్ ఫంక్షన్ మార్పులు సంభవించి అల్జిమర్స్ గా రూపాంతరం చెందుతాయి. అందుకే సరిపడా నిద్ర ఉండడం…అదికూడా రాత్రివేళ నిద్ర చాలా అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.