జనసేన, బీజేపీ పొత్తుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అవసరాల కోసం సహజంగా అనేక పార్టీ నేతలను కలుస్తామని.. గతంలో చంద్రబాబును కూడా రాష్ట్రపతికి మద్దతు ఇచ్చిన సమయంలో కలిశామని.. అలా కలిసిన వారందరితో పొత్తు ఉన్నట్లు కాదని సోము వీర్రాజు తెలిపారు.
జనసేన, బీజేపీ పొత్తుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని.. కలిసే ముందుకు వెళతామన్నారు. ఈ ప్రభుత్వం పై ఇద్దరం కలిసే పోరాడతామన్నారు. కలిసి ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భవిష్యత్తులో కూడా జనసేన, బీజేపీ కలిసే ప్రయాణం చేస్తుందని సోము వీర్రాజు పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం సహజంగా అనేక పార్టీ నేతలను కలుస్తామని.. గతంలో చంద్రబాబును కూడా రాష్ట్రపతికి మద్దతు ఇచ్చిన సమయంలో కలిశామని.. అలా కలిసిన వారందరితో పొత్తు ఉన్నట్లు కాదని సోము వీర్రాజు తెలిపారు.
అయితే పవన్ కళ్యాణ్ తమ పార్టీ పెద్దలను కలిసి మాట్లాడారంటే తమ బంధం ఎంత బలమైనదో తెలుసుకోవాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. తామిద్దరం కలిసి వైసీపీ ప్రభుత్వం మీద ఉద్యమిస్తామని వెల్లడించారు. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. రాజకీయాల్లో కొన్ని రచనలు జరుగుతాయన్నారు. నాయకులు ఏది మాట్లాడినా ఒక వ్యూహంతో మాట్లాడతారన్నారు. మా సత్యకుమార్, ఇతర నేతలపై దాడి అందరూ చూశారన్నారు. తమ పార్టీ అధిష్టానం కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉందని సోము వీర్రాజు వెల్లడించారు.