ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగే అలవాటున్నవారి సంఖ్య చాలా ఎక్కువ. కొందరికి పొద్దున్నే టీ పడనిదే గడవదు. టీ శరీరానికి శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే పంచదార వాడడం వల్ల అనారోగ్యం అని భావించేవారు కాస్త కొత్త టేస్ట్ కోసం సాల్ట్ ట్రై చేయమంటున్నారు ఆరోగ్య నిపుణులు…
సాల్ట్ టీ ప్రయోజనాలు
ఉప్పును అధికంగా తింటే చాలా ప్రమాదం. అలాగే తగినంత తినకపోయినా అనారోగ్యమే. శరీరానికి ఎంత వరకూ అవసరమో అంతే తీసుకోవాలి. అయితే టీలో పంచదార వేసుకునే కన్నా ఉప్పు వేసువేసుకోవడం బెటర్ అంటున్నారు. దీనివల్ల ఆరోగ్యానికి మేలే కానీ కీడు జరగదని గ్యారంటీగా చెబుతున్నారు. టీ చాలా వేడిగా ఉన్నప్పుడే ఉప్పును వేయడం వల్ల ఉప్పు కూడా కాస్త ఉడుకుతుంది. దానిలో చెడు చేసే స్వభావాలు కూడా తగ్గుతాయి.
అధిక రక్తపోటుని తగ్గిస్తుంది
నరాల పనితీరు మెరుగుపడేలా ఇది సహాయపడుతుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. జీర్ణ ఎంజైమ్లు సవ్యంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా టీ లో ఉప్పు వేసుకుని తాగడం చాలా అవసరం.
మైగ్రేన్ తగ్గుతుంది
కొంతమంది చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖంపై మొటిమలతో బాధపడతారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవి తగ్గవు. అలాంటివారు టీలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ఎంతో మంచిది. ఇక మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఇలా సాల్ట్ టీ తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇందులో ఒత్తిడి హార్మోలను తగ్గించే శక్తి ఉంటుంది.
ఇలా ప్రిపేర్ చేయాలి
ఒక పాత్రలో పాలు – నీళ్లు కలిపి స్టౌ పై పెట్టండి. బాగా మరిగిన తర్వాత టీ పొడి వేసి బాగా మరిగించండి. దాన్ని వడకట్టి వేడివేడిగా ఓ గ్లాసులో వేయండి. అది బాగా వేడిగా ఉన్నప్పుడే చిటికెడు ఉప్పు వేయండి చాలు. బాగా కరిగే వరకు ఉంచండి. ఆ ఉప్పదనం మీ నాలుకకు తెలియకూడనంత తక్కువగా ఉప్పు వేయాలి. ఈ టీ నిత్యం తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది. అయితే ఉదయం పూట టీలో ఉప్పు వేసుకుని తాగేవారు ఆ తర్వాత తినే ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.