నిత్యామీనన్ పెళ్లి ఫిక్స్..త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్!

హీరోయిన్ నిత్యామీనన్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోందట. దానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కమింగ్ సూన్ అని టాక్. ఇంతకీ నిత్యా పెళ్లిచేసుకోబోయేది ఎవర్నో తెలుసా…

సౌత్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది నిత్యామీనన్. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ తన నటనతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకునే నిత్యామీనన్..తెలుగులో లాంగ్ గ్యాప్ తర్వాత ‘భీమ్లానాయక్’లో నటించింది. ఆ తర్వాత వెబ్ సిరీస్ లలో బిజిగా ఉంది. కొన్ని రోజులుగా ఈ బ్యూటీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా త్వరలోనే పెళ్లి అనే హడావుడి మరోసారి సాగుతోంది.

మలయాళ హీరోతో నిత్యా పెళ్లి
తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుందట నిత్యామీనన్. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్త చాలాసార్లు వినిపించినా లైట్ తీసుకున్నారు కానీ ఈ సారి మలయాళ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి కొందరు సెలబ్రిటీలు సైతం నిత్యమీనన్ పెళ్లి గురించి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.ఈమె తన చిన్ననాటి స్నేహితులు మలయాళ హీరోని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుందని తెలుస్తోంది. నిత్యామీనన్ పెళ్లిపై గతంలోనూ ఇవే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అప్పట్లో తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది నిత్యామీనన్. ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నానంది. ప్రస్తుతం మలయాళ, తమిళ్ మూవీస్ తో బిజీగా ఉంది.

పెళ్లైనా హీరోయిన్ల జోరు తగ్గేదేలే
ఒకప్పుడు హీరోయిన్ పెళ్లిచేసుకుంటే చాలు ఫేడవుట్ అయిపోయేవారు లేదంటే తల్లి, చెల్లి పాత్రలకు పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ పెళ్లైన హీరోయిన్ల జోరు కొనసాగుతోంది. అక్కడ కరీనా,కత్రియా, అలియా…తెలుగులో నయన్, సమంత క్రేజ్ పెళ్లి తర్వాత కూడా అస్సలు తగ్గలేదు. ఫ్యూచర్లో నిత్యామీనన్ కూడా ఇంతే.. కెరీర్ పరంగా ఈ క్లారిటీ రావడంతో నిత్యా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని టాక్. పెళ్లి గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందంటున్నారు మరి..