తెలుగురాష్ట్రాల్లో పుట్టిన న్యూజిలాండ్ బ్లూ మష్రూమ్స్‌.. వీటిని తినొచ్చా!

తెలంగాణ రాష్ట్రం కాగజ్‌నగర్ అడవుల్లో అరుదైన పుట్టగొడుగులు గుర్తించారు అటవీ అధికారులు. వీటినే స్కై బ్లూ మష్రూమ్‌ అంటారు. మనదేశంలో మొదటిసారిగా 30ఏళ్ల క్రితం ఒడిశా రాష్ట్రంలో వీటిని గుర్తించారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణాలో వెలుగుచూశాయి. ఈ స్కై బ్లూ మష్రూమ్స్ న్యూజిలాండ్ పుట్టినిల్లు . ఇంతకీ వీటిని తినొచ్చా…

న్యూజిలాండ్ కరెన్సీపై వీటి చిహ్నం
తెలంగాణలో మెుదటిసారిగా అరుదైన పుట్టగొడుగులు కనుగొన్నారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కవాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో గల కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో ఆల్-బ్లూ మష్రూమ్ జాతిని గుర్తించారు. దీని శాస్త్రీయనామం ఎంటోలోమా హోచ్‌స్టెట్టెరి. వీటినే ‘బ్లూ పింక్ గిల్’ లేదా ‘స్కై-బ్లూ మష్రూమ్’ గా పిలుస్తారు. ఈ జాతి పుట్టగొడుగులు గులాబీ, ఊదా రంగులలో ఉంటాయి. గడిచిన వారం ఆదిలాబాద్ అడవుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తు్న అటవీశాఖాధికారులకు ఈ పుట్టగొడుగులు కనిపించాయి. న్యూజిలాండ్‌లో ఈ జాతి పుట్టగొడుగులు కనిపిస్తాయి. ఆ దేశ కరెన్నీ నోటుపై కూడా ఈ పుట్టగొడుగు చిత్రాన్ని ముద్రించారు. న్యూజిలాండ్ దేశపు $50 నోటు మీద ఇది కనిపిస్తుంది. ఈ పుట్టగొడుగులను ఆ దేశ జాతీయ ఫంగస్‌గా కూడా గుర్తించారు.

వీటిని ఆహారంగా తీసుకోపోవడమే మంచిది
కిరణజన్య సంయోగక్రియ ద్వారా చక్కెరలకు బదులుగా పోషకాలను ఉత్పత్తి చేయడం మైకోరైజల్ జాతుల ప్రత్యేకత. పుట్టగొడుగుల కారణంగా చెట్లకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు ఆరోగ్య నిపుణులు.. అయితే వీటిని ఆహారంగా తీసుకోకపోవటమే మంచిదన్నారు. ఎంటోలోమా జాతులు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో కూడిన బయోయాక్టివ్‌లను కలిగి ఉంటాయని… వివిధ వ్యాధుల నివారణ, మెడిసిన్ తయారీలోనూ ఉపయోగించే అవకాశం ఉందన్నారు ఆరోగ్య నిపుణులు. ప్రపంచంలోనే అరుదైన ఈ పుట్టగొడుగులను సంరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామన్నారు అటవీ అధికారులు.

విటమిన్లు పుష్కలంగా ఉంటాయి
సాధారణంగా అందరూ తినే బుట్టగొడుగులలో బి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. రిబోఫ్లేవిన్, ఫోలేట్, థియామిన్, పాంతోతేనిక్ ఆమ్లం మరియు నియాసిన్. ఇవి మనం తీసుకునే ఆహారం నుంచి శక్తిని వినియోగించుకోవడానికి, శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళే ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి శరీరానికి సహాయపడతాయి. అయితే తెలంగాణలో కొత్తగా పుట్టుకొచ్చిన నీలిరంగు మష్రూమ్స్ తినకపోవడమే మంచిదంటున్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం