ఏపీలో ఎన్డీఏ కూటమి స్వీప్ – అసెంబ్లీలో కూడా అవే ఫలితాలు ?

జాతీయ మీడియా సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఘన విజయం ఖాయమని అంచనా వేశాయి. అలా ఇలా కాదు… కూటమికి ఇరవై నుంచి ప్రారంభమవుతాయి. ఇరవై ఐదు వరకూ లోక్ సభ సీట్లు లభించవచ్చు. వైసీపీకి సున్నా నుంచి ప్రారంభమవుతాయి.. చివరికి అది ది బెస్ట్ అన్న పొజిషన్‌లో నాలుగు దగ్గర ఆగుతాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ చాలా మందిని ఆశ్చర్యపర్చలేదు.

ఏపీలో ఎన్డీఏ అద్భుతమైన వ్యూహం

దక్షిణాదిన ఈ సారి మంచి ఫలితాలు సాధిస్తామని భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు పలు సందర్భాల్లో పూర్తి స్థాయి ధీమా వ్యక్తం చేశారు. వారు దానికి తగ్గట్లుగా ఎక్సర్‌సైజ్ చేశారని ఏబీపీ-సీఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో స్పష్టమయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సారి ఎన్డీఏ కూటమికి అత్యధిక సీట్లు లభించనున్నాయి. మొత్తం 25 లోక్ సభ సీట్లలో 21 నుంచి 25 వరకూ ఎన్‌డీఏ కూటమికి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్‌సీపీకి సున్నా నుంచి 4 సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారు. అంటే ది బెస్ట్ అనే పొజిషన్‌లో వైఎస్ఆర్‌సీపీకి నాలుగు స్థానాలు వస్తాయి. మిగతా అన్నీ ఎన్డీఏ కూటమికే కలసి వస్తాయి.

బీజేపీతో కలిసిన టీడీపీ, జనసేన – అదే గేమ్ ఛేంజర్

ఆంధ్రప్రదేశ్‌ ఇలా ఒక్క సారిగా ఎన్‌డీఏకు అనుకూలగా మారడానికి కారణం బీజేపీ పాత మిత్రుల్ని కలుపుకునేందుకు అంగీకరించడమే. గత ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్‌సీపీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా చేసిన పరిపాలన పెద్ద మైనస్ గా మారింది. అదే సమయంలో గతంలో సహకరించిన వారందరూ దూరమయ్యారు. ఓ వైపు పార్టీలన్ని కలవడం.. జగన్ కు అందరరూ దూరమవడం కీలకంగా మారింది.

అసెంబ్లీలోనూ ఇంతే ఫలితాలు

అసెంబ్లీలోనూ ఇవే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికల సీట్ల నిష్పత్తిలోనే సీట్లు వస్తే వైసీపీ తుడిచిపెట్టుకోపోతుంది. యాక్సిస్ మై ఇండియా అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ను ఆదివారం ప్రకటించనుంది.