విశాఖ తూర్పులో ఎంవీవీ ఆపరేషన్ షురూ – రామకృష్ణబాబును ఓడిస్తారా ?

విశాఖ తూర్పు నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు అప్పగిస్తూ వైసిపి అధికారికంగా నిర్ణయం తీసుకుంది. అధికార పార్టీ వర్గాలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంవీవీ తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగేందుకు అధిష్ఠానం పచ్చజెండా ఊపినట్లే.

వరుసగా గెలుస్తున్న టీడీపీ అభ్య.ర్థి – ఈ సారి ఎంవీవీకి చాన్స్

విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబు వరుసగా గెలుస్తూ వస్తున్నారు ఆయనను ఓడించాడనికి ఈ సారి ఎంపీ ఎంవీవీని రంగంలోకి దించుతున్నారు. ఇప్పటి వరకూ అక్కరమాని విజయనిర్మల తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ పోటీచేసే అవకాశాలున్నట్లు సమాచారం. VMRDA చైర్మన్ అక్కరమాని విజయనిర్మల కి వైసీపీ అధిస్థానం ఝలక్ ఇచ్చింి. 2019 ఎన్నికల ముందు చివరి క్షణంలో అక్కరమాని విజయనిర్మలని విశాఖ తూర్పుకి కేటాయించి భీమిలి నియోజకవర్గం కి అవంతిని పంపింది వైసిపి అధిష్టానం. ఇప్పుడు మరోసారి అన్యాయమైపోయానని అక్కరమాని అనుకుంటున్నారు.

నేతల్ని డబ్బుతో కొడుతున్న ఎంవీవీ

తనపై అసంతృప్తి వ్యక్తం చేయకుండా విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నేతలను డబ్బుతో కొడుతున్నారు. నేతలందరికీ పార్టీలు ఇచ్చి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ‘ఖరీదైన కానుక’ అందజేసినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ఎంవీవీ సత్యనారాయణ ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులతో మంగళవారం రాత్రి నగరంలోని ప్రముఖ క్లబ్‌లో విందు ఏర్పాటుచేశారు.

అందరికీ ఖరీదైన బహుమతులు

వచ్చే ఎన్నికల్లో తన విజయానికి కృషిచేయాలని దుకు హాజరైన వారికి నూతన వస్త్రాలతోపాటు భారీ బహుమతి కూడా అందజేసినట్టు సమాచారం. ఇదంతా అడ్వాన్స్‌ మాత్రమేనని ఎన్నికల నాటికి మరోసారి అందరితోనూ ఇదే రీతిలో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని ఆయన హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఖరీదైన కానుకను తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్‌గా గెలిచి ముఖ్యమైన పదవిలో ఉన్న ఒకరు మాత్రం తిరస్కరించారని అంటున్నారు. అందరూ ఓకే అనకపోవడం… ఎంవీవీ ఇబ్బందే అయినా డబ్బెవరికి చేదు అన్న చర్చ జరుగుతోంది. నేతల్ని ఎలా ట్యూన్ చేసుకోవాలో.. ఎంవీవీకి బాగా తెలుసంటున్నారు.