నిర్మల్ జిల్లాలో ముథోల్ నియోజకవర్గంలో బీజేపీ హవా కనిపిస్తోంది. కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగు కాగా… బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండక.. పనులు చేయక మత రాజకీయాలకు పాల్పడే ప్రయత్నం చేయడంతో ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇదే సమయంమలో బీజేపీ కి అనూహ్యమైన మద్దతు కనిపిస్తోంది.
గత నాలుగేళ్లలో భారీగా బలం పుంజుకున్న బీజేపీ
నియోజకవర్గంలో ముథోల్ , బైంసా రూరల్ , బైంసా పట్టణం, కుబీర్, కుంటాల , లోకేశ్వరం , బాసర మండలాలు ఉన్నాయి..వీటిలో 2,26,725 మంది ఓటర్లు ఉన్నారు. ప్రదానంగా నియోజకవర్గం లో మున్నూరు కాపు, ముస్లిం, లంబడా, మరాఠా , ఓటర్లు ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల. మద్దుతుతో గడ్డేన్నగారి విఠల్ రెడ్డి 2014లో కాంగ్రెస్ నుండి గెలుపోందారు…మారిన. రాజకీయ పరిస్థితులతో టిఅర్ ఎస్ లో చేరారు. , 2018లో జరిగిన. ఎన్నికలలో 83,933ఓట్లతో 46%ఓట్లు సాదించారు.. బిజెపి నుండి పోటీ చేసిన రమాదేవి 40,602ఓట్లతో 22% ఓట్లు సాదించారు. రమాదేవి పై 43,331 మేజారీటీ రికార్డుస్థాయిలొ విజయం సాదించారు విఠల్ రెడ్డి . కానీ తర్వాత పరిస్థితి మారిపోయింది.
ఎమ్మెల్యేగా విఫలమైన విఠల్ రెడ్డి
.. విఠల్ రెడ్డి వైపల్యాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది… సమస్యల పై అట్టిముట్డనట్లుగా ఉండే ఎమ్మెల్యే తీరు ప్రజలకు నచ్చడంలేదు.. దీనితో పాటు పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది. అయినా ఆయనకే టిక్కెట్ ప్రకటించారు. విఠల్ రెడ్డి పై ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతోపాటు… ముథోల్ నియోజకవర్గం లో బిజెపి బలమైన ఓటు బ్యాంకు ఉంది… గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గంలో బిజెపిపట్టుందని నిరూపితమైంది…దీనికి తోడు బైంసా మున్సిపల్ లో ఎంఐఎం కి పట్టుంది… ఎళ్లుగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోని పాలన సాగిస్తోంది.. ఎంఐఎం పాలనకు వ్యతిరేకంగా హిందూ సానుభూతి ఓటర్లు బిజెపికి మద్దతు పలుకుతుున్నారు.
మజ్లిస్ కనుసన్నల్లో బీఆర్ఎస్
బిజెపి తో పాటు హిందువాహిని బలంగా ఉంది… ఇక్కడి నుండి రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు బిజెపి అభ్యర్థి రమాదేవి.. అయితే బిజెపికి నియోజకవర్గం లో ఊపు పెరిగింది… ఇటీవల బండిసంజయ్ పాదయాత్ర నియోజకవర్గం లో పార్టీకి బలాన్ని పెంచింది…గెలుపు ఖాయమనే బావన పార్టీ నాయకులలో పెరిగింది..ఒకవైపు సంజయ్ పాదయాత్ర, మరోవైపు కాంగ్రెస్ మాజీ డీసీసీ అధ్యక్షుడు రామరావు పటేల్, మోహన్ రావు పటేల్ పార్టీలో చేరారు… రమాదేవి తో పాటు ఈ ఇద్దరు కూడ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు …పార్టీ అభ్యర్థులుగా ప్రకటించకపోయినా ప్రజల్లో కి ముగ్గురు వెళ్లుతున్నారు..ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఎన్నికలలో పోటీ చేసి విఠల్ రెడ్డి పై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దమవుతున్నారు… రామారావు పటేల్ కాంగ్రెస్ వీడటంతో ఆ పార్టీకి పోటీ చేసే అభ్యర్థి కరువయ్యారు…ద్వితీయ. శ్రేణి నాయకులే పోటీ దిక్కు అన్నట్లు చందంగా మారింది…