కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ముద్రగడ ? టార్గెట్ జనసేన !

కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం.. గత నాలుగేళ్లుగా ఆ పోరాటం చేయడం లేదు. కానీ వైసీపీకి దగ్గరయ్యారు. బీజేపీ ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లు కాపులకు దక్కేలా చట్టం చేసినా…. జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. అయినా ఆయన లక్ష్యం రిజర్వేషన్లు కాదు.. రాజకీయ పదవి కాబట్టి ఆయన కూడా.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం.. తాజాగా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. ఓ లేఖ విడుదల చేశారు.

పవన్ పై ముద్రగడ విమర్శలు

గోదావరి జిల్లాల్లో వారాహియాత్ర చేస్తున్న పవన్ పై ముద్రగడ పద్మనాభం విమర్శలు చేస్తూ.. తెర ముందుకు వచ్చారు. మూడు పేజీల లేఖ విడుదల చేశారు. ఇందులో.. బీజేపీతో కలిసి పోటీ చేస్తే.. సీఎం ఎలా అవుతారనే ప్రశ్నలు ఉన్నాయి. ఈ లేఖను చూసి వైసీపీ వాళ్లు స్క్రిప్ట్ పంపితే… ముద్రగడ సంతకం పెట్టి విడుదల చేశారన్న అభిప్రాయాన్ని జనసైనికులు వ్యక్తం చేస్తున్నారు. కాపులపై ఇష్టారీతిన ప్రభుత్వం అణిచివేతకు పాల్పడుతున్నప్పుడు ముద్రగడ మాట్లాడలేదని.. ఇప్పుడెందుకు పవన్ పై దాడి చేస్తూ తెరపైకి వస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి .

కాకినాడ ఎంపీ టిక్కెట్ ను ఖరారు చేసుకున్నారా ?

ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట తన రాజకీయ నిర్ణయం త్వరలో తీసుకుంటానని చెప్పుకొచ్చారు మూడు పేజీల నిండా కాపుల కోసం తాను చేసిన పోరాటాల్ని గుర్తు చేసుకున్నారు. తన కుటుంబ గొప్పదనం గురించి చెప్పుకున్నారు. కాకినాడ ఎంపీ టిక్కెట్ కోసం ఆయన పెట్టిన ప్రతిపాదన వైసీపీ ఓకే చేసిందని చెబుతున్నారు. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగీ గీత పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

కాపులను ముద్రగడ ముంచేసినట్లేనా ?

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 2016లో తునిలో రైలు దగ్దమైంది. ఈ కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేశారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. గత ప్రభుత్వంలో రిజర్వేషన్ల కోసం తీవ్ర ఉద్యమం చేసినా ఈ ప్రభత్వంపై ఆయన సాఫ్ట్ గా ఉన్నారు. ఎలాంటి ఉద్యమం చేయలేదు. గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు చెల్లుతాయని కేంద్రం చెప్పినా ముద్రగడ పెద్దగా స్పందించలేదు. రద్దు చేసిన ఐదు శాతం రిజర్వేషన్లను పునరుద్దరించాలని ఆయన ఎలాంటి ఉద్యమం చేయలేదు