స్వాతి రెడ్డి అంటే గుర్తు పట్టడం కొంచెం కష్టమే కానీ ‘కలర్స్’ స్వాతి అని చెబితే ఠక్కుమని గుర్తు పడతారు. స్వాతి పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి. తెలుగు బుల్లితెరపై ఆమె ఎంత ఫేమస్ అంటే… టాక్ షో ‘కలర్స్’ పేరు ఆమె ఇంటి పేరు అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత విదేశాలు వెళ్లిపోయింది. ఈ మధ్యే సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది స్వాతి. తాజాగా ఆమె నటించిన మూవీ మంత్ ఆఫ్ మధు ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది..
కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మంత్ ఆఫ్ మధు’. భానుమతి & రామకృష్ణ ఫేమ్ శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా స్వాతికి కెరీర్ పరంగా పుష్ ఇస్తుందని ఫిక్సైపోయారు. ఇంతకీ మంత్ ఆఫ్ మధు సినిమా ఎలా ఉందంటే.. ప్రేమించి పెళ్లిచేసుకున్న జంట ఆ తర్వాత విడిపోవాలని డిసైడ్ అయి కోర్టుకెక్కుతారు. అదే సమయంలో అమెరికాలో స్థిరపడిన అమ్మాయి ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు భారత్ వస్తుంది. ఆమె తల్లిని ఎదిరించి పెళ్లిచేసుకుంటుంది..తన వైవాహిక జీవితం ఎలా సాగిందనేది మరో కథ. ఇలా రెండు కథలను ఓ సినిమాగా తెరకెక్కించారు. వాస్తవానికి తమిళం, మలయాళంలో న్యాచులర్ సినిమాలు చూసి మనోళ్లు ఎందుకు ఇళాంటి మూవీస్ తీయరు అనుకుంటారు కదా..ఇంచుమించు అలాంటి సినిమానే మంత్ ఆఫ్ మధు. రెండు కథలు మంచివే కానీ వాటిని నడిపించిన తీరు నిరాశపరుస్తుంది. భార్య – భర్త, వాళ్ళ మధ్య మనస్పర్ధలు, బాధ, ప్రేమ, విరహం… ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి కానీ వాటిని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారన్నది ప్రేక్షకుల ఫీలింగ్.
నటన పరంగా నవీన్ చంద్ర, స్వాతి ఇద్దరూ మెప్పించారు కానీ ఇది సినిమాగా కన్నా వెబ్ సిరీస్ గా వచ్చి ఉంటే బావుండేదంటున్నారు ప్రేక్షకులు.
అసలు కలర్స్ స్వాతి ఇంత గ్యాప్ తీసుకుని రీఎంట్రీకి ఇలాంటి కథ ఎలా సెలెక్ట్ చేసుకుందో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా అందం, నటనలో స్వాతికి ఫుల్ మార్క్స్ కాబట్టి ఆమె కెరీర్ కి వచ్చిన నష్టం ఏమీ ఉండదు. ముందు ముందు స్వాతి అకౌంట్లో మంచి సినిమాలు, సిరీస్ లు పడడం ఖాయం…