దసరా నుంచి అన్ స్టాపబుల్ సీజన్ 3 ప్రారంభం కానుంది. ఈ సారి గెస్టులు లిస్ట్ కూడా గత రెండు సీజన్లని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్రింగ్ విషయం ఏంటంటే ఈ షోలో నందమూరి మోక్షజ్ఞ కూడా పాల్గొంటాడని తెలుస్తోంది. అంటే మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా సిద్ధమైందని ఫిక్సైపోయారు నందమూరి అభిమానులు
భగవంత్ కేసరి టీమ్ తో మోక్షజ్ఞ
అన్ స్టాపబుల్ సీజన్ 3 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సారి అన్ స్టాపబుల్ స్టేజ్ పై నందమూరి యంగ్ స్టార్ మోక్షజ్ఞ సందడి చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్ కేసరి ప్రమోషన్ లో భాగంగా అన్ స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ ను రెడీ చేస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, శ్రీలీల , నిర్మాతతో పాటూ మోక్షజ్ఞ కూడా ఇదే స్టేజ్ పై సందడి చేయబోతున్నాడని టాక్. అంటే ఇదే స్టేజ్ పై మోక్షజ్ఞ…సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై క్లారిటీ రానుందని ఫిక్సైపోయారంతా..
అనిల్ రావిపూడితో మోక్షజ్ఞ డెబ్యూ
ఏ దర్శకుడి చేతుల మీదుగా మోక్షజ్ఞని పరిచయం చేస్తారో క్లారిటీ ఇవ్వలేదు కానీ..అనిల్ రావిపూడి దాదాపు ఫైనల్ అంటున్నారు. భగవంత్ కేసరి మూవీ సమయంలో మోక్షజ్ఞ ఎక్కువగా సెట్స్ కి వస్తూ ఉండే టైమ్ లో దర్శకుడు అనిల్ రావిపూడితో క్లోజ్ బాండింగ్ ఏర్పడిందని తెలుస్తోంది. అందుకే భగవంత్ కేసరి ప్రమోషన్ లో భాగంగా మోక్షజ్ఞ పాల్గొన్నప్పుడు..అనిల్ రావిపూడి తనని హీరోగా లాంచ్ చేస్తారని ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్టైతే..మోక్షజ్ఞ ఎంట్రీ పక్కాగా అనిల్ రావిపూడి చేతులమీదుగానే ఉండబోతోంది.
మోక్షజ్ఞ సరసన శ్రీలీల
హీరోయిన్ మాత్రం శ్రీలీల దాదాపు ఫిక్సైనట్టే. ఆ విషయం రీసెంట్ గా భగవంత్ కేసరి సినిమా ఫంక్షన్ లో బాలకృష్ణ బయటపెట్టారు. శ్రీలీలతో హీరో-హీరోయిన్ గా చేద్దామా అని అడిగినట్టు ఇంట్లో చెబితే మోక్షజ్ఞ తనపై కోప్పడ్డాడని బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ ఫంక్షన్లో చెప్పారు. అంటే మోక్షజ్ఞ సరసన హీరోయిగా శ్రీలీల ఫిక్స్.
ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు కావాల్సిన అన్ని యాక్టివిటీస్ పై దృష్టి పెట్టాడు మోక్షజ్ఞ. డాన్స్, ఫైట్స్ నేర్చుకుంటున్నాడు. యాక్టింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా భగవంత్ కేసరి యూనిట్ తో కలసి దిగిన పిక్స్ చూస్తుంటే..లుక్ పరంగా కూడా బెటర్ అయ్యేందుకు గట్టిగా వర్కౌట్లు చేస్తున్నట్టు అర్థమవుతోంది. మొత్తానికి నందమూరి అభిమానులు ఎదురుచూసిన శుభముహూర్తం త్వరలోనే ఉండబోతోందని మాత్రం క్లారిటీ వచ్చేసింది.