అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీల పేరుతో అధికారానికి వచ్చిన వాళ్లు దేశాన్ని దోచుకోవడంలోనే బిజీగా గడుపుతున్నారు.వందలు కాదు. వేలు కాదు…లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం అవినీతిపరుల ఖాతాల్లోకి వెళ్లిపోతోంది. చాలా కాలంగా వాళ్లు చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని తప్పించుకు తిరుతున్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వ బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అవనీతిపరుల భరతం పట్టే ప్రక్రియ మొదలైంది. అవినీతిపరులు ఒక్కరొక్కరుగా బుక్కవుతున్నారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని మోదీ తేల్చేశారు…
దోచుకున్న సొమ్ము కక్కాల్సిందే…
లోక్ సభ ఎన్నికల ముందు ఆఖరిసారిగా పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని మోదీ…అవినీతిపై ప్రత్యేక ప్రస్తావన చేశారు. ప్రజల సొమ్మును దోచుకున్న వారిపై దర్యాప్తు ఏజెన్సీలు చర్యలు తీసుకుంటే..గగ్గోలు పెడుతున్నారని ఆయన గుర్తుచేశారు. పదేళ్ల క్రితం అవినీతిపై బడా ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు మాత్రం కక్షసాధింపు అంటూ కొత్త పల్లవి అందుకున్నారన్నారు. అవినీతిపరులపై చర్యలు తీసుకుంటుంటే వాటిని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈడి తన పని తాను చేసుకుపోతుందని దోచుకున్న డబ్బును తిరిగి వసూలు చేస్తుందని ఆయన అంటూ అవినీతిపరులను హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న సంగతిని గుర్తుచేస్తూ..తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన దర్యాప్తు జరుగుతోందన్నారు….
రూ.లక్ష కోట్ల ఆస్తులు జప్తు…
అవినీతిని వెలికితీయడం, వారి ఆస్తులను జప్తు చేయడం లాంటి చర్యల్లో ఈడీ అమిత వేగాన్ని ప్రదర్శిస్తోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రకారం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం రూ.5 వేల కోట్ల ఆస్తులను మాత్రమే జప్తు చేశారు. ఇప్పుడు బీజేపీ నేతృత్వ ఎన్డీయే హయాంలో రూ.లక్ష కోట్లు దాటిపోయింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. దేశప్రజలను మోసగించి దోచుకునే వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదని , వారిని చట్టం ముందు నిలబెడతామని మోదీ అన్నారు. వందేళ్లలో కాంగ్రెస్ సాధించిన అభివృద్ధిని బీజేపీ పదేళ్లలో సాధిస్తే ఓర్వలేని పార్టీలు..లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మోదీ అన్నారు. అవినీతిపై సమరంలో తాను చేపట్టే చర్యలకు అడ్డు తగులుతున్నాయని అన్నారు.
కేజ్రీవాల్, సోరెన్, కవిత టార్గెట్
ఇప్పుడు దేశం మొత్తం ఆ ముగ్గురు చూట్టూ చూస్తోంది. జార్ఖండ్ మైనింగ్ స్కామ్ లో ఆ రాష్ట్ర మాజీ సీఎం హోమంత్ సోరెన్ ఇప్పటికే అరెస్టయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఈడీ విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఏదోక రోజున ఆయన హాజరు కాక తప్పదు. ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత కూడా ఇప్పుడు కోర్టును ఆశ్రయించి తప్పించుకుంటున్నారు. ఇలాంటి తప్పించుకు తిరిగే చర్యలు ఎక్కువ కాలం పనిచేయవు. ఏదోక రోజున చట్టం ముందు నిలబడాల్సిందే. తిన్న సొమ్ము క్కకాల్సిందే. ప్రధాని మోదీ చెప్పింది కూడా అదే…