పారిశ్రామిక అభివృద్ధి ఉన్న దేశం ప్రపంచంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది. ప్రస్తుతం భారత్ ఆ దిశగా రైట్ ట్రాక్ లో ఉంది. పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. దీనికికారణం ప్రధానిగా నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనచో తీసుకున్న నిర్ణయాలు.. చేపట్టిన సంస్కరణలు.
తయారీ రంగంపై మోదీ ప్రత్యేక దృష్టి
తయారీ రంగంలో లో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు, మోదీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్‌తో పాటు మేక్ ఇన్ ఇండియా కింద అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రొడక్షన్ – లింక్డ్ ఇన్సెంటివ్ పథకంతో ఈ రంగం మరింత ఊపందుకుంది. ప్రొడక్షన్ – లింక్డ్ ఇన్సెంటివ్ వెనుక ఉన్న లక్ష్యం దేశీయ తయారీని ప్రపంచవ్యాప్తంగా పోటీగా మార్చడం. PLI పథకాలు లక్షలాది ఉద్యోగాలను సృష్టించాయి. భారత ఆర్థిక వ్యవస్థను వేగవంతమైన వృద్ధి పథంలో ఉంచాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం కింద కోటి కంటే ఎక్కువ చిన్న తరహా పరిశ్రమలను కాపాడింది. వాటిని శాశ్వత మూసివేత నుండి రక్షించింది. ఎంఎస్ఎంఈ లకు మేలు చేసేలా కార్మిక , పర్యావరణ చట్టాలలో మార్పులు వంటి సంస్కరణలు MSMEలు తమ కార్యకలాపాలను విస్తరించడానికి, అభివృద్ధి చేయడానికి ఉపయోగపడ్డాయి. దీని వల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగాలు నిలబడటమే కాదు కొత్తవి సృష్టించారు కూడా.
పారిశ్రామిక రంగం ఊహించనంతగా ప్రోత్సాహం
దేశీయ ఔత్సాహిక పారి శ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు లను(ఎఫ్‌డీఐలు) ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. పెట్టుబడులను అనువైన ఒక వాతావరణా న్ని సృష్టించడంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆర్థిక వ్యవ స్థకు చెందిన పలు రంగాల కోసం ఎఫ్‌డీఐ పాలసీ సరళీకరణ, శాసనపరమైన సంస్కరణలు, తదితర చర్యలను చేపట్టింది. ఈ చర్యలు కొన్ని ఫలాలను అందించాయి. ఉదాహరణకు 2014 -15 ఆర్థిక సంవత్సరానికి 45 బిలియన్ డాలర్లుగా నమోదైన ఎఫ్‌డీఐ.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 84.83 బిలియన్ డాలర్లకు పెరిగింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ లోకి 83.57 బిలియన్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ప్రధాని మోదీ డైనమిక్ నాయకత్వంలో భారతదేశం ప్రపంచం ఇష్టపడే పెట్టుబడిదారుల గమ్యస్థానంగా మారింది.
ఊహించనంతగా పెరుగుతున్న ఎగుమతులు
భారతదేశ ఎగుమతులను పెంచడానికి .. 2030 నాటికి భారతదేశ వస్తువులు మరియు సేవల ఎగుమతులను 42 ట్రిలియన్లకు తీసుకెళ్లడానికి మోడీ ప్రభుత్వం కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని కూడా ప్రకటించింది. గత తొమ్మిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ విశేషమైన అభివృద్ధిని చూసింది. ఈ కారణంగా సమాజంలోని వివిధ వర్గాలలోని భారతీయులందరి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. “నేడు ప్రపంచం భారతదేశాన్ని పెట్టుబడికి ఆకర్షణీయమైన గమ్యస్థానంగా చూస్తోంది మరియు ప్రపంచ కంపెనీలు ఇక్కడ వ్యాపారాలను స్థాపించాలనుకుంటున్నాయి.” అని ప్రపంచబ్యాంత్ తన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎనాలిసిల్‌లో అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ వృద్ధి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు భారత్ సూపర్ పవర్ అవుతుంది.