ప్రవాసుల కోసం మోదీ ప్రయత్నాలు సక్సెస్ – గ్రీన్ కార్డుల పరిమితి పెంచనున్న బైడెన్ !

అమెరికాలో స్థిర నివాసం ఎక్కువమంది ప్రవాస భారతీయుల కల. దీనికోసం జారీచేసే గ్రీన్‌కార్డు కోసం వేలాదిమంది ఎన్‌ఆర్‌ఐలు సుదీర్ఘకాలంగా వేచిచూస్తున్నారు. ఈ క్రమంలో మనవాళ్ల కలను మరింతగా సాకారం చేసే కీలక అడుగు పడనుంది. ప్రస్తుతం ఏటా 1,40,00 గ్రీన్‌కార్డులు జారీ అవుతున్నాయి. వలస విధానంపై బైడెన్‌ ప్రభుత్వం స్థాయిలో జరుగుతున్న కసరత్తు ఫలిస్తే.. ఈ సంఖ్య మరికొంత పెరగవచ్చు.

మోదీ పర్యటనలో బైడెన్ తో చర్చ

ప్రధాని మోదీ పర్యటనకు ముందే అమెరికా ప్రభుత్వం భారతీయులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. గ్రీన్‌కార్డు నిబంధనలను అమెరికా ప్రభుత్వం మార్చింది. విదేశీయులకు అమెరికాలో శాశ్వత నివాసం కోసం జారీ చేసే అర్హత నిబంధనలను మార్చారు. అమెరికా ప్రభుత్వం ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్న వేలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. మోదీ పర్యటనలో ఈ అంశంపై చర్చించారు. ఇప్పుడు బైడెన్ కూడా హామీని నిలబెట్టుకుంటూ రూల్స్ మార్చస్తున్నారు

వాడుకలో లేని గ్రీన్ కార్డులు వెనక్కి !

గతంలో జారీచేసిన గ్రీన్‌కార్డుల్లో వాడుకలో లేనివాటిని వెనక్కి తీసుకోవాలని అధ్యక్షుని సలహామండలి యోచిస్తోంది. కుటుంబ, ఉద్యోగ సంబంధంగా జారీచేసిన కార్డులు. అలాంటివి 1992 నుంచి 2022 మధ్యకాలానికి సంబంధించి 2,30,000 వరకు ఉంటాయని అంచనా. వీటిని వెనక్కి తీసుకుని.. ప్రతి సంవత్సరం కొన్ని చొప్పున వీటిని పునఃపంపిణీ చేయాలని సలహా మండలి సూచించింది. ఈ నిర్ణయం అమలైతే మనవాళ్లకు గ్రీన్‌కార్డు జారీ గతంతో పోల్చితే మరింత సులువు కానుంది. అధ్యక్షుని సలహామండలిలో ఆసియా సంతతి అమెరికా పౌరులు, నేటివ్‌ హవాయివాసుల, పసిఫిక్‌ ద్వీపకల్పవాసుల వ్యవహారాలు సభ్యునిగా ఉన్న భారతీయ సంతతి అమెరికా పౌరుడు అజయ్‌ భుటోరియా గురువారం తాజా సిఫారసు చేశారు.

ఏడు శాతం క్యాప్ వల్ల భారతీయులకు నష్టం

ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లి అక్కడే శాశ్వతంగా స్థిరపడాలనుకునే వలసదారులకు అమెరికా పర్మనెంట్‌ రెసిడెంట్‌ కార్డ్ లను ఇస్తుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్‌ చట్టం ప్రకారం.. ప్రతి ఏటా రు 1,40,000 గ్రీన్‌ కార్డులను జారీ చేస్తుంది. అయితే ఒక్కో దేశానికి పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని జారీ చేస్తుంటారని గుర్తించుకోవాలి. మొత్తం దరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7% మాత్రమే కేటాయించాలన్నది ప్రస్తుత విధానం. ఇమ్మిగ్రేషన్‌ డీ అర్హతలు ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం గ్రీన్‌ కార్డు జారీ చేస్తున్నారు. ఈఏడీ నిబంధనలను సడలించడంతో గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్న వాళ్లకు మంచి రోజులు వచ్చినట్టే భావిస్తున్నారు.