పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, మోదీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి చిన్న మరియు మధ్య తరగతి రైతులకు ఏటా రూ. 6,000 రూపాయలు ఇస్తోంది. ఈ మొత్తాన్ని రూ. 2వేలు చొప్పున 3 విడతలుగా ఇస్తున్నారు. ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద క్రెడిట్ కార్డునూ ఇస్తున్నారు. దీని ద్వారా సులభంగా కేసీసీను తయారుచేసుకోవచ్చు. అంతేకాకుండా క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు 4 శాతం వడ్డీపై రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు రుణం లభిస్తుంది. గురువారం మరోసారి ఈ పథకం కింద నిధులు విడుదల చేస్తున్నారు . కొత్తగా రూ. 15 లక్షలను కేంద్ర ప్రభుత్వం అందించేందుకు కొత్త ఏర్పాటు చేస్తోంది. అదే పీఎం కిసాన్ ఎఫ్‌పీవో యోజన !
పీఎం కిసాన్ ఎఫ్‌పీవో యోజన అంటే ?
11 మంది రైతులతో కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఈ పథకం కింద రైతులకు రూ.15 లక్షలు ఇస్తారు. ఇందులో కొత్త వ్యవసాయ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. పథకం ప్రయోజనాన్ని పొందడానికి.. 11 మంది రైతులను చేర్చడం ద్వారా ఒక సంస్థ లేదా కంపెనీని ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. దీంతో రైతులకు వ్యవసాయ పరికరాలు లేదా ఎరువులు, విత్తనాలు లేదా మందులు కొనుగోలు చేయడం కూడా సులభతరం కానుంది. ఈ పథకం కింద రూ.15 లక్షలను ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌కు అందజేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలంటే..?
ముందుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
హోమ్ పేజీలో ఇచ్చిన FPO ఎంపికపై క్లిక్ చేయండి.
ఇక్కడ ‘రిజిస్ట్రేషన్’ ఎంపికపై క్లిక్ చేయండి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫారమ్ తెరవబడుతుంది.
ఇప్పుడు ఫారమ్‌లో అడిగిన మొత్తం సమాచారాన్ని పూరించండి.
పాస్‌బుక్ లేదా రద్దు చేయబడిన చెక్, ID రుజువును స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
ఇప్పుడు సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
లాగిన్ చేయడానికి, ముందుగా నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
హోమ్ పేజీలో ఇచ్చిన FPO ఎంపికపై క్లిక్ చేయండి.
లాగిన్ ఎంపికపై క్లిక్ చేయండి. లాగిన్ ఫారమ్ మీ ముందు తెరవబడుతుంది.
దానిలో వినియోగదారు పేరు పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి, దానితో లాగిన్ చేయండి.
రైతులకు పూర్తి స్థాయిలో సహకారం
రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 2023-24 నాటికి 10,000 FPOలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతుల ఉత్పాదకతను పెంపొందించడానికి, సరైన రాబడిని పొందడానికి చర్యలు తీసుకుంటున్నారు. 5 సంవత్సరాల వరకు ప్రభుత్వం వైపు నుండి కొత్త FPOకి హ్యాండ్ హోల్డింగ్, సపోర్ట్ అందిసతుంది ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు రైతులలో వ్యవసాయ-వ్యవసాయ నైపుణ్యాలను అభివృద్ధి చెందేందకు సహకరిస్తుంది.