ప్రధాని మోదీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తేలిపోయింది. సబ్కా సాథ్, సబ్కా వికాస్.. ప్రధాని మోదీ ఒక్కరి వల్లే సాధ్యమని కూడా దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు. బీజేపీ నేతృత్వ ఎన్డీయేకు 400 లోక్ సభా స్థానాలిచ్చేందుకు జనం నిర్ణయించుకున్నారని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిగ్గు తేల్చాయి. ఇక ఎగ్జాట్ పోల్స్ రావడమే తరువాయి అన్నట్లుగా పరిస్థితి ఉంది.ఈ క్రమంలో మూడో సారి అధికారానికి వస్తే ఏం చేయాలో మోదీ మహాశయుడు ఇప్పుడే అజెండా సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజా సేవలో ఒక్క రోజు కూడా వృధా కాకూడదని టీమ్ మోదీ ఆకాంక్షిస్తోంది..
ఢిల్లీ చేరగానే ప్రధాని బిజీ…
ప్రధాని మోదీ కన్యాకుమారిలో 45 గంటల ధ్యాసం ముగించుకుని నిన్న ఢిల్లీ చేరారు. ఇవాళ కార్యాచరణ ప్రారంభిస్తూ ఒకే రోజున ఏడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తుపాను బీభత్సంపై ఒక సమావేశం జరిపితే… దేశంలో వడదెబ్బపై మరో సమావేశం నిర్వహించారు. ఈ నెల 5న నిర్వహించాల్సిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై కూడా మోదీ మీటింగు పెట్టారు.ఈ సందర్భంగా మోదీ ఎక్స్ లో ఒక సందేశమిచ్చారు. ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు పడ్డాయని ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని ఆయన కితాబిచ్చారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించేందుకే జనం భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చారన్నారు.
అజెండా సిద్ధం చేస్తున్న బీజేపీ…
దేశ ప్రజలకు దశలవారీగా సంక్షేమం, అభివృద్ధి అందించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకు ఎన్డీయే భాగస్వాములంతా సహకరిస్తారని విశ్వాసంతో ఉంది. తొలి నుంచి హ్యాట్రిక్ విజయంపై బీజేపీ ధీమాతో ఉంది. అందుకే ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మోదీ అనేక అంశాలను ప్రస్తావించారు. అధికారానికి వచ్చిన వంద రోజుల్లో చేయాల్సిందేమిటో నిర్దేశించుకోవాలని మంత్రులందరినీ ఆదేశించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేయబోయే పనులపై అవగాహన ఉందా అని ఆయన వారిని అడిగారు. 2024 నుంచి 2029 వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాల్లో ఫోకస్ ఏరియాస్ ను గుర్తుంచాలని, వాటిపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. పదేళ్లలో సాధించిందేమిటో ఇప్పటికే ఆయా శాఖల సెక్రటరీలు నివేదికలను రూపొందించి ప్రధాని కార్యాలయానికి (పీఎంఓ) పంపారు. ఈ క్రమంలో మంత్రుల పనితీరు ప్రశంసనీయంగా ఉందని కూడా పీఎంఓ సంకేతాలిచ్చింది..
పదేళ్లలో కీలక చర్యలు
ప్రధాని మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో అనేక విజయాలతో ప్రజాసేవలో తరించింది. ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాఖ్ కు తిలోదకాలు లాంటి నిర్ణయాలతో అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకుంది. రామాలయ నిర్మాణంతో భారతీయులందరినీ సంతృప్తి పరిచింది. ఆర్థికరంగంలో గణనీయమైన అభివృద్ది సాధించి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఉంది. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ పీఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించింది. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా అక్రమ వలసదారులను నిలువరించడం సాధ్యపడింది. ఇప్పుడు అలాంటి చర్యలన్నింటినీ మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అనివార్యతను బీజేపీ గుర్తించింది. జమ్మూకశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పించాల్సి ఉంది. ఆర్థిక రంగంలో మరిన్ని సంస్కరణకు చేపట్టాలి. రవాణాను మెరుగు పరిచే దిశగా వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచాలి. పేదల సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి…