రైతులకు రూ. 3.7 లక్షల కోట్ల ప్యాకేజీ – అసలైన రైతు బంధు మోదీ !

దేశంలో అత్యధిక భాగం జనాభా ఆధారపడ్డ వ్యవసాయం కోసం, రైతుల కోసం రూ. 3.7 లక్షల కోట్ల విలువైన భారీ ప్యాకేజికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజి ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతుల శ్రేయస్సు, ఆర్థిక మెరుగుదలపై దృష్టి సారించింది. ఈ కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు సహజ, సేంద్రీయ వ్యవసాయాన్ని బలోపేతం చేస్తారు.

యూరియాపై భారీ సబ్సిడీ

యూరియాపై సబ్సిడీ భారం పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తోంది. దేశంలో రైతులు వినియోగించే యూరియాలో సింహభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంపొందిస్తూ స్వయం సమృద్ధి స్థాయి సాధించే వరకు ఈ సబ్సిడీని కొనసాగించనుంది. యూరియా బస్తా రూ.242 కు రైతులకు రంతరం లభ్యమయ్యేలా ఈ పథకాన్ని రూపొందించింది. సబ్సిడీ లేకుండా ఇదే బస్తాకు వాస్తవ ధర రూ. 2,200గా ఉంటుందని వెల్లడించింది. కేబినెట్ ఆమోదించిన ప్యాకేజి ద్వారా 2022-23 నుంచి 2024-25 వరకు యూరియా సబ్సిడీ కోసం కేటాయింపులు జరిపింది. 2025-26 నాటికి 195 లక్షల మెట్రిక్ టన్నుల సంప్రదాయ యూరియాకు సమానమైన 44 కోట్ల బాటిళ్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఎనిమిది నానో యూరియా ప్లాంట్లు ఏర్పాటవుతాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

మార్కెట్లోకి యూరియా గోల్డ్

రైతు ప్యాకేజీలో భాగంగా సల్ఫర్ పూతతో కూడిన యూరియా (యూరియా గోల్డ్) దేశంలో మొదటిసారిగా ప్రవేశపెడుతున్నట్టు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వేప పూతతో కూడిన యూరియా కంటే ఇది మరింత సమర్థవంతంగా పని చేస్తుందని పేర్కొంది. ఇది దేశంలోని నేలలో సల్ఫర్ లోపాన్ని కూడా పరిష్కరిస్తుందని వెల్లడించింది. రైతులకు ఇన్‌పుట్ ఖర్చులను ఆదా చేయడంతో పాటు మెరుగైన ఉత్పత్తి, ఉత్పాదకతతో రైతులకు ఆదాయాన్ని కూడా పెంచుతుంది.

భూసారం, పోషణ కోసం పీఎం ప్రణామ్

వ్యవసాయంలో రసాయన ఎరువుల సమతుల్య, స్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి సహజమైన మార్గాలకు తిరిగివెళ్లే దిశగా ఈ పథకం ఉపయోగపడుతుంది. సహజ, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ప్రత్యామ్నాయ ఎరువులు, నానో ఎరువులు, బయో-ఎరువుల వంటి ఆవిష్కరణలు భూసారాన్ని పెంచి ఉత్పాదకతను పెంపొందించడంలో దోహదపడతాయని కేంద్రం వెల్లడించింది. ఇందుకోసం “మదర్ – ఎర్త్ (పిఎంప్రణామ్‌) పునరుద్ధరణ, అవగాహన ఉత్పత్తి, పోషణ మరియు మెరుగుదల కోసం పిఎం ప్రోగ్రామ్” ప్రారంభించనున్నట్టు బడ్జెట్‌లోనే ప్రకటించింది. గోబర్ధన్ ప్లాంట్ల నుండి సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించడానికి మార్కెట్ అభివృద్ధి సహాయం ( కోసం రూ.1451.84 కోట్లు నిధులను అందించాలని నిర్ణయించారు.

చక్కెర రైతులకు మరింత తీపి

ఇథనాల్ బ్లెండెడ్ విత్ పెట్రోల్ ( కార్యక్రమం విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంతో పాటు దేశ ఇంధన భద్రత బలోపేతం చేసింది. దిగుమతి చేసుకున్న శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించింది. పెట్రోలియం రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. 2025 నాటికి 60 ఎల్ఎంటీ కంటే ఎక్కువ చక్కెరను ఇథనాల్‌కు మళ్లించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చక్కెర నిల్వల సమస్యను పరిష్కరిస్తుంది, భారతదేశం ఇప్పుడు ప్రపంచ చక్కెర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద చక్కెర ఎగుమతిదారుగా భారతదేశం అవతరించింది. చక్కెర సీజన్ 2021-22 లో చక్కెరలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారతదేశం అవతరించింది. 2025-26 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తి దేశంగా అవతరిస్తుందని అంచనా.