దేశవ్యాప్తంగా ప్రజల మూడ్ క్లియర్ – మూడో సారి భారీ మెజార్టీతో ప్రధానిగా మోదీ !

లోక్‌సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి., ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం ఎవరిదన్న అంశంపై ఏబీపీ సీ ఓటర్ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఒపీనియన్ పోల్ సేకరించింది. అత్యంత విస్తృతంగా , శాస్త్రీయంగా జరిగిన ఈ ఒపీనియన్ పోల్‌లో బారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందని తేలింది.

NDAకు 42 శాతం ఓట్లు 295-335 మధ్య సీట్లు

దేశవ్యాప్తంగా ప్రజల ఒపీనియన్ పోల్స్ ను విశ్లేషించిన తర్వాత ఎన్డీఏ కూటమికి దాదాపుగా 42 శాతం ఓట్లు వస్తాయని తేలింది. ఈస్జ్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్‌ల వారీగా ఈ ఒపీనియన్ పోల్స్ సేకరించారు. అన్ని జోన్స్ లో కలిపి 42 శాతం ఓట్లతో పాటు 295 నుంచి 335 సీట్లు వస్తాయని తేలింది. ఇక ఇండియా కూటమి గతంలో కంటే గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బీజేపీపై గెలిచేంత వరకూ వారు పోటీ ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ తో సహా ఇండియా కూటమిలోని పార్టీలకు 38 శాతం ఓట్లు 165 నుంచి 205 వరకూ సీట్లు రావొచ్చని అంచనా వేశారు. ఇక రెండు కూటముల్లోని పార్టీలకు 20 శాతం ఓట్లు 35 నుంచి 65 సీట్ల వరకూ రావొచ్చని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ తేల్చింది.

ఈస్జ్ జోన్‌లో గట్టి పోటీ కానీ బీజేపీదే హవా

దేశంలో ఒక్క సౌత్ జోన్‌లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కూటమి ఆధిపత్యం చూపిస్తోంది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ఎన్డీఏదే హవా. ఈస్జ్ జోన్‌లో మొత్తం 153 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జోన్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 42 శాతం ఓట్లు 80 నుంచి 90 వరకూ లోక్ సభ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 38 శాతం ఓట్లు 50 నుంచి 60 లోక్‌సభ సీట్లు వచ్చే చాన్స్ ఉంది. ఇతర పార్టీలకు 20 సాతం ఓట్లు 10 నుంచి 20 వరకూ లోక్ సభ సీట్లు సాధించే చాన్స్ ఉంది.

నార్త్ జోన్‌లో పూర్తిగా బీజేపీ ఆధిపత్యం

ఇక నార్త్ జోన్ పూర్తిగా బీజేపీ ఆధిపత్యం చూపించబోతోంది. మొత్తం నార్త్ జోన్ లో 180 పార్లమెంట్ సీట్లు ఉంటే.. అందులో 50 శాతం ఓట్లతో బీజేపీ 150 నుంచి 160 సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కూటమికి 36 శాతం ఓట్లతో 20 నుంచి 30 సీట్లు మాత్రమే వస్తాయి. ఇతరులకు పధ్నాలుగు శాతం ఓట్లు వస్తాయి కానీ సీట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. సున్నా నుంచి ఐదు లోక్ సభ సీట్ల వరకూ వచ్చే చాన్స్ ఉంది.

వెస్ట్ జోన్‌లోనూ బీజేపీదే హవా

ఇక ఇండియాలో వెస్ట్ జోన్‌గాభావించే మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి హవా కనిపించనుంది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 78 సీట్లు ఉండగా బీజేపీ కూటమి 45 నుంచి 55 సీట్లు వస్తాయి. 46 శాతం ఓటింగ్ లభిస్తుంది. కాంగ్రెస్ కూటమికి 37 శాతం ఓట్లు 25 నుంచి 35 పార్లమెంట్ సీట్లు లభించే అవకాశం ఉంది. ఇతరులకు 17 శాతం ఓట్లు సున్నా నుంచి ఐదు వరకూ లోక్ సభ సీట్లు లభించే అవకాశం ఉంది.

సౌత్ జోన్‌లో గట్టిపోటీ ఇస్తున్న బీజేపీ

బీజేపీ బలహీనంగా ఉందని భావిస్తున్న సౌత్ జోన్‌లో కాంగ్రెస్ కూటమి గట్టి పోటీ ఎదుర్కోనుంది. సౌత్ జోన్‌లో మొత్తం 132 లోక్ సభసీట్లు ఉంటే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 19 శాతం ఓట్లు లోక్ సభ సీట్లు 20 నుంచి 30 వరకూ వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమికి 40 శాతం ఓట్లతో 70 నుంచి 80 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు కూటముల్లో లేని పార్టీలు 41 శాతం ఓట్లు తెచ్చుకుని 25 నుంచి 35 లోక్ సభ సీట్లను పొందే అవకాశం ఉందని తేలింది. ఈ స్తానాల్లో ఏపీకి చెందిన ఇరవై ఐదు లోక్ సభ స్థానాలున్నాయి. ఎవరు గెలిచినా ఎన్డీఏకే మద్దతిస్తారు. అంటే ఎన్డీఏ ఖాతాలో పడినట్లే.