తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేననేది బహిరంగరహస్యమని రాజకీయవర్గాలు మొదటి నుంచి అనుమానిస్తున్నాయి. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అని నమ్మించి.. కాంగ్రెస్ తరపున కొంత మందిని గెలిపించి వారిని బీఆర్ఎస్ కు పంపడం అనే వ్యూహాన్ని గత రెండు సార్లు కాంగ్రెస్ అమలు చేసింది. ఇప్పుడు కూడా అదే పని చేయబోతోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్
కేసీఆర్ , కాంగ్రెస్ కు మధ్య ఉన్న అవగాహనలో భాగంగా ముఫ్పై మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ రెండు రోజుల కిందట ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని పట్టించుకోనట్లుగా ఉంది కానీ.. నిజం ఏమిటో వారికి బాగా తెలుసు. కాంగ్రెస్ లో గెలిచే ఎమ్మెల్యేలు రిజల్ట్ వచ్చిన రోజేనే బీఆర్ఎస్ పెద్దలతో టచ్ లోకి వెళ్లడం కామన్ గా జరుగుతోంది. ఈ సారి నేరుగా పార్టీలో చేరిపోతారన్న ప్రచారం జుగుతోంది.
హంగ్ వస్తుందన్నఅంచనాతో బీజేపీకి చాన్సివ్వకూడదని మరింత కుట్ర
తెలంగాణలో హంగ్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సారి మరింత పకడ్బందీగా రెండు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కన్సాలిడేట్ అవుతోందన్న ప్రచారంతో పాటు… ఏదైనా తమ మధ్యనే ఉండాలన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. కానీ ఈ విషయం రాజకీయ పార్టీలందరికీ తెలుసు. తెలంగాణలో ప్రచారం చేస్తున్న బీజేపీ కేంద్ర కమిటీ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి కూడా తన ప్రచారంలో అదే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కొందరు నేతలు గెలిచినా తిరిగా ఆ ఎమ్మెల్యేలు గతంలో లాగానే బిఆర్ఎస్ పార్టీలోకి వలస వెళ్తారన్నారు.
తెలంగాణ ప్రజలకు క్లారిటీ వస్తోందా ?
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్ర రాజకీయాలపై ఓ స్పష్టతకు వస్తున్నారు. ఆ రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని.. అదే అవినీతి పాలన సాగుతుందని స్పష్టత వస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే… నేరుగా బీజేపీకి ఓటేయడమే మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో బీజేపీ సభలకు అనూహ్య స్పందన కనిపిస్తోంది.