కిస్ మిస్ చాలా మంది ఇష్టపడరు కానీ డ్రై ఫ్రూట్స్ లో తక్కువ కాస్ట్ లో దొరికేవి కిస్ మిస్ మాత్రమే. ప్రతి స్వీట్ లో కిస్ మిస్ వేయాల్సిందే. కేవలం దీన్ని గార్నీష్ లా కాకుండా తినటానికి కూడా ట్రై చేయండి. ఎండుద్రాక్షలో కార్బోహైడ్రేట్లు, నాచురల్ షుగర్ కంటెంట్ ఉంటుంది. వీటిని తీసుకోవటం వలన రోజంతా మంచి ఎనర్జీ ఉంటుంది. దీనిలో ఎన్నిపోషకాలున్నాయో తెలుసా..
ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!
ఎండుద్రాక్షని డైలీ డైట్ లో చేర్చుకుంటే వెయిట్ కంట్రోల్ ఉంటుంది. ఊబకాయం రాకుండా సాయ పడుతుంది. ఎండుద్రాక్షలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవాళ్లు కిస్ మిస్ తీసుకోవటం వలనఈ సమస్యకి చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే ఇది RBC రూపొందించటంలో సహాయపడుతుంది. దీనికారణంగా ఐరెన్ డెఫీసెన్సీ, అనీమియాను నిరోధిస్తుంది. ఎండుద్రాక్ష ఎక్కువగా మహిళలు, పిల్లలకు సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. ఎండుద్రాక్షలో అనామ్లజనకాలు సమృద్ధిగా ఉంటాయి, ఇది ఆక్సీకరణ ఒత్తిడి, నష్టాన్నితగ్గించడానికి సహాయపడుతుంది, కళ్లకింద , చర్మం మీద చారలు, ముడుతలను నిరోధిస్తుంది. వీటిలో ఉండే ఫైబర్ ఓ మంచి మూలం. మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలను నివారించడంలో మనకు సహాయపడుతుంది.
డయాబెటిక్స్ కి కూడా మంచిదే
ఎండుద్రాక్ష రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో డయాబెటీస్ ఉన్నవారికి ఇది ఓ మంచి ఆరోగ్యకరమైన చిరుతిండి. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి, హార్ట్ డిసీజ్ లను, ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రీహైర్టెన్షన్ వల్ల బాధపడుతున్నవారిలో అధిక రక్తపోటు లక్షణాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఈ డ్రై ఫ్రూట్ లో ఉండే సిస్టోలిక్, డయాస్టొలిక్ అధిక రక్తపోటుని నివారిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక అధ్యయనంలో, 12 వారాలపాటు డైలీ ఎండుద్రాక్షను తీసుకున్నవారిలో రక్తపోటులో గణనీయమైన మార్పు కనిపించింది. మరొక క్లినికల్ అధ్యయనంలో వారానికి 4 లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఎండు ద్రాక్షలు తీసుకున్నట్లు అయితే అదిక రక్తపోటును తగ్గించినట్లు తెలుస్తోంది.
కాన్సర్ కి బెస్ట్ మెడిసన్
ఎండు ద్రాక్ష చర్మ క్యాన్సర్ను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. అనామ్లజనకాలు,ఫినాల్స్ , పాలీఫెనోల్స్ లాంటి ఇతర ఫైటోకెమికల్స్ ఎండు ద్రాక్షలో ఉంటాయి. ఈ ఫైటో కెమికల్స్ ను అధికంగా ఉన్న ఆహార పదార్ధాల తీసుకోవటం వలన అనేక రకాల క్యాన్సర్లను నిరోధించవచ్చని పరిశోధనలో తేలింది. మానవ పెద్దప్రేగు కాన్సర్ కణాలకు వ్యతిరేకంగా ఎండుద్రాక్ష ప్రభావాన్ని అంచనా వేసిన ఓ అధ్యయనం ప్రకారం, అధిక స్థాయిలో ఫినాల్ కాంపౌండ్స్ రాడికల్ వ్యతిరేక చర్యలకు, పెద్దప్రేగు కాన్సర్ నివారణకు ఎండు ద్రాక్ష కారణమని గుర్తించారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.