జగన్ ట్రెండ్ సెట్టర్ – మరోసారి రుజువైంది : మంత్రి రోజా..!!

టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేనాని పవన్ పై మంత్రి రోజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌పై చర్చలో మాట్లాడిన రోజా 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నిర్వహించిన సదస్సుకు ఎప్పుడూ ఇలాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు రాలేదు. 44 నెలల్లోనే తన నాయకత్వంలో, తన పరిపాలనతో ఇంతమంది పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తెచ్చారంటే.. సీఎం వైయస్‌ జగన్‌ ఇమేజ్‌ దేశ వ్యాప్తంగా ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు.

సీఎం జగన్‌ ఎప్పుడు ఏది చేసినా ట్రెండ్‌ చేస్తారన్నారు రోజా. ఈ సమ్మిట్‌తో ట్రెండ్‌ సెట్టర్‌ అని మరోసారి నిరూపించుకున్నారని చెప్పారు. పరిశ్రమలు తరలిపోతున్నాయి, పారిశ్రామికవేత్తలు రావడం లేదని టీడీపీ చేసిన గోబెల్స్‌ ప్రచారాన్ని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌తో తిప్పికొట్టామని రోజా పేర్కొన్నారు. సీఎం జగన్‌ తీసుకువచ్చిన ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాలు చూసి పారిశ్రామిక వేత్తలు కూడా నమ్మకంతో మన రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం అవుతామని చెప్పారంటే ఇది సీఎం జగన్‌ విజయంగా అభివర్ణించారు. ఒక నాయకుడు తన పార్టీ పెట్టి పదేళ్లు అయ్యిందని సభ పెట్టి దారినపోయేవారితో ఎంవోయూలు చేయించారని మాట్లాడారంటూ పరోక్షంగా పవన్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ముఖేష్‌ అంబానీ, కరన్‌ అదానీ, జిందాల్, దాల్మియా, ఒబేరాయ్‌ వంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలను దారినపోయేవారు అన్నారంటే ఆ మనిషికి నిజంగా లోకజ్ఞానం ఉందా అంటూ ప్రశ్నించారు.