Ambati Rambabu: అది వంద శాతం చంద్రబాబు తప్పిదమే.. పోలవరం ప్రాజెక్ట్‌ సమీక్షలో మంత్రి అంబటి రాంబాబు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి అంబటి రాంబాబు ఆదివారం ఉదయం పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పనుల పరోగతిపై సమీక్షించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి అంబటి రాంబాబు ఆదివారం ఉదయం పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పనుల పరోగతిపై సమీక్షించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మనవ తప్పిదం.. గత ప్రభుత్వ తొందరపాటు చర్యల వల్లే పోలవరం ప్రాజెక్ట్‌కి తీవ్ర నష్టం ఏర్పడిందని ఆరోపించారు. నిపుణుల బృందాలు ప్రాజెక్ట్ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించాయని.. గతేడాది వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ బాగా దెబ్బతిందంటూ వివరించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయని.. గత వరదల్లో 485 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్టు నిర్దారించారని తెలిపారు. డయా ఫ్రమ్‌ వాల్‌ గ్యాప్‌లో 1,396 మీటర్ల పొడవు కాగా.. వరదల వల్ల డయాఫ్రమ్‌ వాల్‌ 485 మీటర్ల వరకు దెబ్బతిందన్నారు. పెద్దపెద్ద గుంతలు కూడా ఏర్పడ్డాయని.. వీటిని సరిచేయకపోతే పనులు ముందుకు సాగవన్నారు. దీని కోసం రూ.2 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారని తెలిపారు. గుంతలు పూడ్చేందుకు 45 లక్షల క్యూసెక్కుల ఇసుక అవసరమని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. ఇది వందశాతం చంద్రబాబు తప్పిదమే అంటూ అంబటి రాంబాబు ఆరోపించారు. పూర్తిగా మానవ తప్పిదం వల్లే ఇలా జరిగిందని అంబటిరాంబాబు వివరించారు. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ద్వారా స్టడీచేశారని.. మూడు రోజుల క్రితమే నివేదిక వచ్చిందని తెలిపారు. ఎవరిపై చర్యలు తీసుకోవాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని అంబటి వివరించారు.

డయాఫ్రమ్ వాల్ కొంత భాగం బాగుందని.. కొన్ని చోట్ల బాగోలేదని అంబటి పేర్కొన్నారు. బాగోని చోట రిపేర్ చేసుకుని ముందుకు వెళ్లవచ్చన్నారు. శాస్త్రీయంగా దెబ్బతిన్న భాగాలను రిపేర్ చేసేందుకు అధికారులు డిజైన్ తయారు చేసిన తర్వాత పనులు మొదలవుతాయతపతాకగ. రాబోయే నాలుగైదు మాసాల్లో ఈ పనులు స్పీడ్ గా చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామతీ.. వై.యస్. ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు.