పాతిక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని … బండి సంజయ్ ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీజేపీ ఇటీవల కొంత దూకుడు తగ్గించింది. ఇదంతా వ్యూహాత్మకమే. బ్యాక్ ఫుట్ వేసి సిక్సర్ కొట్టినట్లుగా.. ఒక అడుగు వెనక్కి వేసి.. భారీ స్థాయిలో చేరికలకు ప్లాన్ చేసినట్లుగా కనిపిపిస్తోంది. పాతిక మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని.. బండి సంజయ్ ఆషామాషీగా చెప్పలేదని బీజేపీ వర్గాలంటున్నాయి. దీనికి బలమైన సంకేతాలు ఉన్నాయంటున్నారు.
సిట్టింగ్ లకు నమ్మించి హ్యాండివ్వనున్న కేసీఆర్
తెలంగాణ సీఎం , బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిట్టింగ్‌లకు గట్టి షాక్ ఇవ్వబోతున్నారు. పాతిక మందికి టిక్కెట్లు నిరాకరించబోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపైన, ప్రత్యేకించి కొందరు ఎమ్మెల్యేలపైనా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని.. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని, కేసీఆర్ సర్కారు నిరంకుశ విధానాలను అవలంబిస్తోందని ఇప్పటికే సర్వేల ద్వారా వెల్లడయింది. రైతుల రుణమాఫీ లేకపోవడం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకపోవడం, ధరణి సమస్యలు, పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం వంటివీ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాయి. ఈ వ్యతిరేకతను తగ్గించుకోవాలంటే ఎమ్మెల్యేలను బలివ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
కేసీఆర్ బలి పశువుల్ని చేయబోతున్నట్లుగా ఇప్పటికే ఎమ్మెల్యేలు క్లారిటీ !
కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ను తమపైకి నెట్టి.. తమను బలి చేయబోతున్నారని.. పాతిక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఓ క్లారిటీ వచ్చింది. 2018 ఎన్నికల్లో ఏడుగురు సిటింగ్‌లకు మాత్రమే టికెట్లు ఇవ్వలేదు. ఇప్పుడు దానికి భిన్నంగా భారీ మార్పులు ఉండనున్నాయని ఇప్పుడా మాట మీద నిలబడడం కష్టమని పార్టీ శ్రేణులే పేర్కొంటున్నాయి. సిటింగ్‌లందరికీ టికెట్లు అంటే ఎన్నికల ముందే చాలా చోట్ల ఓటమిఅంచుల్లోకి వెళ్లడమేనని బీఆర్ఎస్ అధినాయకత్వం నిర్ణయించుకుంది. ఎవరెవరికి సీట్లు నిరాకరించబోతున్నారో వారికి క్లారిటీ ఉంది. వారంతా బీజేపీ హైకమాండ్ తో టచ్‌లోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు.
ఈసారి బీజేపీ వైపు ప్రజాభిప్రాయం
‘బీఆర్‌ఎ్‌సకు రెండు సార్లు అధికారం ఇచ్చాం. ఈ సారి కొత్త పార్టీకి అవకాశం ఇచ్చి చూద్దాం’ అన్న భావన రాష్ట్రంలోని పలు వర్గాల్లో వ్యక్తమవుతోందని బీఆర్ఎస్ పార్టీ సర్వే నివేదికలు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కూడా చాలా ఏళ్లుగా అధికారంలో ఉంది. బీజేపీ చాన్స్ ఇవ్వాలని ఎక్కువ మంది భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితి మార్చడానికి.. సిట్టింగ్‌లపై వేటు వేసినా.. వారంతా బీజేపీలో చేరితే.. మొదటికే మోసం వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు కంగారు పడుతున్నాయి.