ప్రేక్షకుల పల్స్ తెలిసి వడ్డించే డైరెక్టర్…మాస్ కి ఫుల్ మీల్స్ పెట్టే హీరో… వీళ్ల కాంబో అంటే లెక్కలు మారిపోవాల్సిందే. ఫస్ట్ టైమ్ ‘షాక్’ ఇచ్చినా రెండోసారి ‘మిరపకాయ్’ తో బాక్సాఫీస్ దగ్గర ఘాటు గట్టిగానే పెంచారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి హిస్టరీ రిపీట్ అని గట్టిగానే చెబుతున్నారు. వాళ్లెవరో అర్థమయ్యిందా…
మిరపకాయ్ జోడీ మరోసారి
మాస్ మహారాజ్ రవితేజ – పవర్ పుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్..ఈ కాంబినేషన్ అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఫస్ట్ మూవీ షాక్ సినిమాతో ఓ అడుగు వెనుక వేసిన ఆ తర్వాత మిరపకాయ్ తో రెండు అడుగులు దూసుకొచ్చారు. ఆ తర్వాత ఎవరికి వారే వారి వారి ప్రాజెక్టులలో బిజీ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ జోడీ కట్టేందుకు సిద్ధమయ్యారని టాక్
పవన్ ఇచ్చిన గ్యాప్ లో రవితేజతో మూవీ
‘షాక్’ మూవీ తర్వాత ఐదేళ్లకు రవితేజతో తెరకెక్కించిన మిరపకాయ్.. హరీష్ శంకర్ కి మంచి బ్రేకిచ్చింది. ఆ తర్వాత పవర్ స్టార్ తో తీసిన ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ గా నిలబెట్టింది. వరుణ్ తేజ తో ‘గద్దలకొండ గణేశ్’తో మరో హిట్టందుకుని…ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ బిజీలో ఉన్నాడు. ప్రస్తుతం పవన్ పొలిటికల్ టూర్స్ వల్ల సినిమాకు బ్రేక్ పడటంతో హరీశ్ శంకర్ ..ఈ గ్యాప్ లో రవితేజతో ముందుకెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడని టాక్.
జనవరిలో షూటింగ్ స్టార్ట్
హరీష్ శంకర్ లాంటి కమర్షియల్ డైరెక్టర్‌తో రవితేజ సినిమా అంటే అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ఎప్పటిలా రొటీన్ కామెడీ, మాస్ యాక్షన్ కాకుండా పీరియడ్ డ్రామా అనడంతో ఈ కాంబినేషన్ పై ఇంట్రెస్ట్ బాగానే ఉంది. ఇప్పటికే రవితేజకి స్టోరీ చెప్పేయడం..అట్నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవడం కూడా జరిగిపోయిందట. జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశారని టాక్. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోందట.
ఇప్పటికే వరుస మూవీస్ తో బిజీగా ఉన్న రవితేజ..ఇప్పుడు హరీశ్ శంకర్ తో కూ