మన్ కీ బాత్ వల్ల ప్రజల్లోని భావోద్వేగాలు తెలుసుకునే అవకాశం కలిగిందని ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. తన ఆలోచనలను పంచుకోగలిగానని వెల్లడించారు. 100వ ఎపిసోడ్ లో ప్రధాని మోదీ భావోద్వేగ పూరితమైన అంశాలనువెల్లడించారు. సామాన్యులకు సంబంధించి ప్రతినెలా కొన్ని వేల సందేశాలు మన్ కీ బాత్ లో చదివానని మోదీ గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమం తనను ప్రజలకు మరింత చేరువ చేసిందన్నారు. అసామాన్య సేవలు అందించిన వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం లభించిందన్నారు. చెట్లు నాటడం, పేదలకు వైద్యం అందించడం, ప్రకృతి రక్షణకు నడుం బిగించడం వంటి కార్యక్రమాలు తనలో ప్రేరణ నింపాయని పేర్కొన్నారు. 2014లో విజయదశమి రోజున మన్ కీ బాత్ ను ప్రారంభించినట్లు గుర్తుచేసుకున్నారు. దేశ నలుమూలల ప్రజలు కార్యక్రమంలో భాగస్వాములైనట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మన్ కీ బాత్‌లో చర్చించామని పేర్కొన్నారు.
ప్రపంచం మొత్తం చూసిన మన్ కీ బాత్ వందో ఎపిసోడ్
మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రాంతాల్లో ప్రజలు ప్రధాని సందేశాన్ని చూసేలా ేర్పాటు చేళారు.
‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారం హర్యానాలో లింగ నిష్పత్తిని మెరుగుపరిచిందని మన్ కీ బాత్ 100వ ఎడిషన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హర్యానా నుండే ‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారాన్ని ప్రారంభించానని గుర్తుచేశారు. ‘సెల్ఫీ విత్ డాటర్’ ప్రచారం నన్ను చాలా ప్రభావితం చేసిందని, ఒకరి జీవితంలో కుమార్తె ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి ఈ ప్రచారం జరిగిందని ప్రధాని మోదీ అన్నారు.
మన్ కీ బాత్.. ప్రపంచవ్యాప్త ఆకర్షణ !
ఈ కార్యక్రమంలోని ప్రతి ఎపిసోడ్ దేనికదే ప్రత్యేకమైంది. కొత్త ఉదాహరణలు, కొత్త విజయగాథలు వినగలిగామన్నారు. ఇతరుల్లోని గుణాలను ఆరాధించడానికి మన్ కీ బాత్ నాకొక అవకాశం. నాకు లక్ష్మణ్‌రావ్‌జీ ఇనాందార్ అనే మార్గదర్శకులు ఉండేవారు. ఇతరుల్లోని సద్గుణాలను ఆరాధించాలని నాకు ఆయనే చెప్పారని మోదీగుర్తు చేసుకున్నారు. దేవుడి దగ్గరకు వెళ్లినప్పుడు భక్తులు ప్రసాదంతో కూడిన పళ్లెంతో వెళ్తారు. మనుషుల రూపంలో ఉన్న దేవుణ్ని దర్శించుకోవడానికి నాకు ‘మన్ కీ బాత్’ అలాంటి ప్రసాదంతో కూడిన పళ్లెంలాంటిది. ఈ కార్యక్రమం నాకొక ఆధ్యాత్మిక సాధనంగా మారిందని సంతృప్తి వ్యక్తం చేశారు. మన్ కీ బాత్‌లో ప్రస్తావించిన ప్రతిఒక్కరూ మన హీరోలు. వాళ్లే ఈ కార్యక్రమానికి జీవం పోశారని మోదీ గుర్తు చేసుకున్నారు.
వంద ఎపిసోడ్లలో ప్రస్తావించిన వారిలో కొంత మందిని పలకరించిన ప్రధాని
మన్ కీ బాత్‌లో భాగంగా గతంలో ప్రస్తావించిన అనేక మంది సామాన్యుల్లో కొంతమందిని ప్రధాని ఈరోజు మరోసారి పలకరించారు. ఈ సందర్భంగా విశాఖపట్నానికి చెందిన వెంకటేశ్ ప్రసాద్‌ను గుర్తుచేసుకున్నారు. ఆయన దేశీయ వస్తువులను మాత్రమే వినియోగించేలా చార్ట్‌ను ఎలా రూపొందించారో తెలిపారు. 2014 విజయదశమి రోజు మన్ కీ బాత్ మొదలు పెట్టామని, ప్రజలతో భాగస్వామ్యం అయ్యామని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చర్చించామని, సమాజంలో ఎన్నో మార్పులకు మన్ కీ బాత్ శ్రీకారం చుట్టిందని అన్నారు. చత్తీస్ గఢ్ లోని స్వయం సహాయక సంఘం గురించి మోదీ ప్రస్తావించారు. మహిళా శక్తిని ప్రశంసించారు.
ప్రధాని మోదీది వినూత్న ప్రయత్నమని అభినందనలు
రాజ్ భవన్ లలో, బీజేపీ పాలిత సీఎంల కార్యాలయాల్లో ప్రసారం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నుంచి పోలింగ్ కేంద్రం స్థాయి బీజేపీ నాయకుడి వరకు ఈ మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ ను విన్నారు. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రసారం అయింది. ల అదేవిధంగా లండన్ లోని భారత హైకమిషన్ లోనూ ప్రత్యేక స్క్రీనింగ్ ద్వారా వందో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేశఆరు. మన్ కీ బాత్ కార్యక్రమంపై పలువురు ప్రముఖులు ఇప్పటికే ప్రశంసించారు. వందో ఎపిసోడ్ ప్రసారం అవుతున్న వేళ ప్రధాని మోదీకి మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా అభినందనలు తెలిపారు. ఇదిలాఉంటే ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రేడియోలో కంటే ఇంటర్నెట్ ద్వారానే ఎక్కువ మంది వినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రేడియలో 12శాతం, టీవీల్లో 15 శాతం, ఇంటర్నెట్ లో 37శాతం మంది ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వింటూ వస్తున్నారు.