ఐక్యరాజ్యసమితిలో మన్ కీ బాత్ – వందో ఎపిసోడ్ ప్రపంచ రికార్డు !

మోడీ ప్రధాని అయిన దగ్గర నుంచి ఎప్పుడు ఏదో ఒక రికార్డ్​ సృష్టిస్తున్నారు. నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్​ అయ్యే కార్యక్రమం మోదీ మన్​ కీ బాత్​ 100 వ ఎపిసోడ్​ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కార్యక్రమం ఐక్యరాజ్యసమితి హెడ్​ క్వార్టర్స్​ లో లైవ్​ టెలికాస్ట్​ కానుంది. ఆదివారం మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లో ప్రధాని మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రధాన మంత్రి మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న యూఎన్ హెడ్ క్వార్టర్స్ లోని ట్రస్టీషిప్ కౌన్సిల్ ఛాంబర్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నందున ఒక చారిత్రాత్మక క్షణానికి సిద్ధంగా ఉండండి అంటూ ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్ ట్వీట్ చేసింది.

మన్ కీ బాత్ ఓ ప్రత్యేకం !

ప్రతి నెల ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ పేరుతో రేడియో ప్రసంగం ద్వారా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఏప్రిల్ 30న దీనికి సంబంధించిన 100 వ ఎపిసోడ్ ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. అమెరికా కాలమాన ప్రకారం అక్కడ ఉదయం 1.30 గంటలకు న్యూయార్క్ లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మిలియన్ల మంది పాల్గొనేందుకు మన్ కీ బాత్ స్పూర్తినిస్తుందని భారత మిషన్ పేర్కొంది. న్యూయార్క్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, కమ్యూనిటీ సంస్థలతో పాటు, న్యూజెర్సీలోని ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ సభ్యుల కోసం మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ప్రసారం జరుగుతోంది.

మోదీ ఆశయాలు, ఆదర్శాల మన్ కీ బాత్

ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఏర్పరచుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’ . 2014 అక్టోబరు 3న మొదలు కాగా, అనతి కాలంలోనే జాతీయ ఇష్టాగోష్ఠి కార్యక్రమంగా రూపొందింది ప్రధానమంత్రి పంచుకునే ఆలోచనలు, అభిప్రాయాలు, హిత వచనాలు ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతింబింబిస్తుంటాయి. దేశంలోని అన్ని వర్గాల ప్రజలూ తమ ఇళ్లలో, గ్రామాల్లో, బజారు కూడళ్లలోని దుకాణాల వద్ద రేడియోలకు చెవి అప్పగించి ఆయన ప్రసంగం వింటారు. ప్రధానమంత్రి మాటల ద్వారా అనేక నిజ జీవిత గాథలను, అజ్ఞాత యోధుల కథలను వింటూ ప్రజలు స్ఫూర్తి పొందుతున్నారు. డిజిటల్‌ విప్లవ యుగంలో తన ఔచిత్యాన్ని దాదాపు కోల్పోయే దశకు చేరిన ఓ సాధారణ సమాచార ప్రసార మాధ్యమాన్ని శక్తిమంతమైన సాధనంగా ఇది రూపొందడానికి ‘మన్ కీ బాత్’ ఓ కారణం.

మోదీ శైలి మన్ కీ బాత్ విజయానికి కీలకం !

ప్రజలతో స్వేచ్ఛగా కలిసిపోతూ, ఉత్సాహంగా చర్చలో పాల్గొనేలా చేయగల రకరకాల అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంచుకోవడమే ‘మన్ కీ బాత్’ ప్రత్యేకత. ఆ మేరకు సహజ వ్యవసాయం, చిరుధాన్యాలు , ఫిట్ ఇండియా , ఖేలో ఇండియా , బేటీ బచావో–బేటీ పఢావో , ఇం యువ భారతీయుల ఆవిష్కరణలు ఇలా జమ్ముకశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మోదీ స్పృశించారు. భారత సమాజంపై ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఎంతో సానుకూల ప్రభావం చూపింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కార్యక్రమాన్ని వింటున్నప్పుడు… ఒక సంరక్షకుని పాత్రలో కుటుంబ పెద్ద ఒకరు మీకు మెరుగైన, ఉజ్వల భవిష్యత్తు దిశగా మార్గనిర్దేశం చేస్తున్న భావన మనలో కలిగేలా చేయడంలో మోదీ సక్సెస్ అయ్యారు. అందుకే ఈ కార్యక్రమం విజయవంతం అయింది.