ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అకస్మాత్తుగా రావణకాష్టమైంది. ప్రభుత్వ నిర్ణయాలను అపార్థం చేసుకున్న జనం హింసాత్మక చర్యలకు దిగారు. దానితో రాష్ట్రంలో నిషేధాజ్ఞలు,కొన్ని చోట్ల ఇంటర్నెట్ షట్ డౌన్ విధించాల్సి వచ్చింది.
సీఎం సభా స్థలిని తగులబెట్టిన దుండగులు
మణిపూర్ బీజేపీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ శుక్రవారం పాల్గొనాల్సిన చూరాచంద్ పూర్ సభా స్థలిని గిరిజన హక్కుల ఉద్యమకారులుగా చెబుతున్న కొందరు దుండగులు గురువారం తగులబెట్టేశారు. ఒక జిమ్ ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని కార్యక్రమాల్లో సీఎం పాల్గొనాల్సి ఉండగా.. నిరసనకారులు భారీ సంఖ్యలో దూసుకొచ్చి చైర్లు, టెబుల్స్ ని విరగ్గొట్టాశారు. జిమ్ పరికరాలను గుట్టలుగా పోసి తగులబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ శాంతిభద్రతల సమస్యను సృష్టించారు.
రిజర్వ్ ఫారెస్ట్ సర్వేపై అభ్యంతరం
ప్రభుత్వం నిర్వహిస్తున్న రిజర్వ్ ఫారెస్ట్, రక్షిత అడవుల సర్వేపై భూమిపుత్ర గిరిజన సంఘాల సమాఖ్య అభ్యంతరం చెబుతోంది. జనాన్ని అక్కడ నుంచి తరిమేసేందుకే ఇలాంటి సర్వేలు చేస్తున్నారని, సర్వే నిలుపుదల చేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించింది. గురువారం హింసాకాండ తర్వాత శుక్రవారం బంద్ కూడా నిర్వహించారు. రైతులు, గిరిజనులకు నీడ లేకుండా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గిరిజనుల పట్ల ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ఆరోపిస్తూ కూకీ విద్యార్థి సంఘం కూడా బంద్ కు మద్దతిచ్చింది. పైగా అక్రమ కట్టడాలంటూ మూడు చర్చిలను ప్రభుత్వం ఇటీవల కూల్చివేసింది. దానితో గిరిజన ఫోరం మణిపూర్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే చర్చిలను ప్రభుత్వ స్థలాల్లో నిర్మించినందున వాటిని తొలగించడంలో తప్పులేదని, సుప్రీం కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని హైకోర్టు తీర్పు చెప్పడంతో గిరిజన ఫోన్ అగ్గి మీద గుగ్గలం అవుతోంది..
144 సెక్షన్, ఇంటర్నెట్ బ్యాన్
తాజా హింసాకాండ నేపథ్యంలో మణిపూర్ లోని అన్ని చోట్ల 144 సెక్షన్ విధించారు. ఎక్కడా గుమ్మిగూడే అవకాశం లేకుండా చూస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంతో ప్రభుత్వ నిర్ణయాలను తప్పుదోవ పట్టిస్తున్నారని గుర్తించి.. చూరాచంద్ పూర్ జిల్లాలో ఇంటర్నెట్ తో పాటు మొబైల్ నెట్వర్క్ ను తాత్కాలికంగా నిలిపేశారు. సర్వేలు గిరిజన హక్కులపై ఎలాంటి ప్రభావం చూపవని ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తోంది. అయినా కొన్ని పార్టీల ప్రోద్బలంతో గిరిజన సంఘాల నేతలు రెచ్చిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. గిరిజన ప్రాంతాల్లో అటవీ సర్వేను వ్యతిరేకిస్తూ మార్చి 10న చూరా చాంద్ పూర్, కాంగ్ పోక్పీ, తేంగ్నోపాల్ జిల్లాలో జరిగిన నిరసనలు హింసాత్మకమైన పలువురు గాయపడ్డారు.
హింసను నిరోధించడంలో బీజేపీ సక్సెస్
ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా మణిపూర్లో హింసను నిరోధించి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడంలో బీజేపీ విజయం సాధింంచింది. ప్రధాని మోదీ అధికారానికి వచ్చిన ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఈశాన్య ప్రదేశంలో హింస బాగా తగ్గింది. ఒకప్పుడు మణిపూర్లో మిలిటెంట్ల ప్రైవేటు రాజ్యం నడిచేది. హైవేలను సైతం వాళ్లు ఆక్రమించుకునేసి ప్రైవేటు పన్నులు వసూలు చేసేవారు. అడ్డుపడిన వారిని చంపి పడేసే వారు. పారామిలటరీ దళాలపై దాడులు చేస్తూ బీభత్సాన్ని సృష్టించేవారు. ఆఖరుగా 2016లో నవంబరులో చూరా చాంద్ పూర్ ప్రాంతంలోనే అసోం రైఫిల్స్ విభాగం కాన్వాయ్ పై దాడి చేసి ఆరుగురుని చంపేశారు. అందులో ఒక ఆర్మీ కల్నల్ కుటుంబం కూడా ఉంది. తర్వాతి కాలంలో కాస్త కఠిన చర్యలతో పాటు చర్చల ద్వారా బీజేపీ ప్రభుత్వం హింసను నిరోధించగలిగింది. ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలకు అన్ని వర్గాల మద్దతు కోరుతోంది. భూమి హక్కులను కాపాడే దిశగా ప్రస్తుతం జరుపుతున్న సర్వేను అపోహలతో కొన్ని గిరిజన వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి అయినా సరే త్వరలోనే అన్ని అనుమానాలు పటాపంచలవుతాయని బీజేపీ విశ్వసిస్తోంది. చూడాలి మరి..