మామిడి కాయ Vs మామిడి పండు.. ఆరోగ్యానికి ఏది మంచిది!

మామిడి కాయ పచ్చిగానే తినడం కొందరికి చాలా ఇష్టం
పుల్లటి మామిడికాయ కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు
మామిడి పండు ముక్కలు కట్ చేసుకుని ఆహా..ఇంతకుమించి టేస్ట్ ఏముంది అని తింటారు
ఇంతకీ మామిడి కాయ..మామిడి పండు..ఆరోగ్యానికి ఏది మంచిది..శరీరానికి పోషకాలు పుష్కలంగా అందాలంటే ఏం తినాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?

మామిడి పండుతో పోలిస్తే మామిడి కాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మామిడి కాయ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దీనిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యకరమైన పొట్ట బ్యాక్టిరియాకు ఇది సహకరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఎక్కువ. పచ్చి మామిడిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సమృద్ధిగా ఉంటుంది. మామిడి పండ్లలో బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆక్సీకరణ నష్టం జరగకుండా సహాయపడడంతో పాటూ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బీటా కెరోటిన్‌తో సహా కెరోటినాయిడ్లు ఉంటాయి. ఈ కెరోటినాయిడ్లు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు…ఇవి కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. అయితే పచ్చి మామిడి కాయ ఎవరైనా తినొచ్చు కానీ పండులో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి..అందుకే డయాబెటిక్ పేషెంట్లు తినకూడదు. పైగా పండుతో పోలిస్తే పచ్చి మామిడి కాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే రెండూ తినడం మంచిదే.

తొక్కే కదా అని పడేయకండి
మామిడి కాయ, పండ్లు సంగతి సరే..మరి తొక్కనేం చేస్తారు. చక్కగా పీల్ చేసి డస్టబిన్ లో పడేస్తుంటారు. అయితే మామిడి తొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో తెలుసా? పీచు, యాంటీఆక్సిడెంట్లు, మొక్కల సమ్మేళనాలు, విటమిన్లు ఎ, సి, కె, ఫోలేట్, మెగ్నీషియం, కోలిన్ , పొటాషియం వంటి గుణాలు మామిడి తొక్కలో ఉన్నాయి. వృద్ధాప్యాన్ని నిరోధించడంలో సహాయపడడంతో పాటూ ఎన్నో తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షిస్తుంది. మామిడి తొక్క చాలా అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తొక్కలో ఉండే పైబర్ గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి తొక్క తింటే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉండే మామిడి కాయలు, పండ్లపై చాలా రసాయనాలు ఉంటున్నాయి. అందుకే మామిడి తొక్క తినాలి అంటే వాటిని ఉప్పు నీళ్లలో బాగా కడగాలి. అలా నేరుగా తినొచ్చు లేదంటే చట్నీ చేసుకుని కూడా తినొచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం