సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలు చాలామంది ఉన్నారు. మరి వారికి సరిగ్గా సరిపోయే విలన్ ఉన్నప్పుడే కదా బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ గట్టిగా వినిపిస్తుంది. మొన్నటి వరకూ ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రావురమేష్ లాంటి వాళ్లు విలన్స్ గా ట్రెండ్ సెట్ చేశారు. పాన్ ఇండియా మార్కెట్ పెరిగిన తర్వాత ఇతరభాషల నటులను భాగం చేసుకోక తప్పడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ విషయానికొస్తే ఏ మూవీలో చూసినా మల్లూవుడ్ విలన్ల జోరే..
పృథ్వీరాజ్ సుకుమారన్
మలయాళంలో మంచి స్టార్ డమ్ ఉన్న హీరోలంతా టాలీవుడ్ లో విలన్లుగా మారిపోతున్నారు. ఇప్పటికే సలార్ కోసం మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ని తీసుకున్నారు. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా ఎందుకు మారారు అన్నదే స్టోరీ లైన్. ఈ మూవీలో పృథ్విరాజ్ యాక్షన్ ప్రభాస్ కి ధీటుగా ఉండబోతోందని టాక్.
ఫహద్ ఫాజిల్
ఒక్కటి తగ్గిందంటూ ఫహద్ ఫాజిల్ పుష్ప కోసం విలన్ గా మారాడు. పుష్ప ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారీ భారీ డైలాగ్స్ లేకపోయినా ఒక్కటి తగ్గింది అంటూ షెకావత్ ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇప్పుడు పుష్ప 2లో భన్వర్ సింగ్ షెకావత్ విలనిజం ఓ రేంజ్ లో ఉండబోతోందట.
సుదేవ్ నాయర్
నితిన్ నటిస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ లో మెయిన్ విలన్ సుదేవ్ నాయర్ నటిస్తున్నాడు. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు లో విలన్ గా వీరంగం సృష్టించాడు సుదేవ్.
షైన్ టామ్ చాకో
మరో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో టాలీవుడ్ విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేశాడు. దసరా, రంగబలి సినిమాల్లో పవర్ ఫుల్ రోల్ పోషించాడు..ఎన్టీఆర్ దేవరలోనూ ఉన్నాడు
జోజు జార్
వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవలోలో విలన్ గా కనిపించాడు జోజు జార్.
జయరాం
టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు జయరాం. పాజిటివ్, నెగిటివ్ క్యారెక్టర్ ఏదైనా జయరాం నటన పీక్స్..
మొత్తానికి టాలీవుడ్ లో విలన్లుగా ఓ వెలుగు వెలుగుతున్నారు మల్లూవుడ్ హీరోలు…