సినిమా లెంగ్త్ పెరుగుతుందని ఆలోచించడం లేదు..ఆలస్యం అయిపోతుందేమో అనే హడావుడి లేదు..ఎవరేం అనుకున్నా తమపని తాము చేసుకుంటూ వెళ్లిపోతున్నారు ఆ దర్శకులు. డైరెక్టర్ ‘కెప్టెన్ ఆఫ్ ద షిప్’ అన్నట్టు ఇప్పుడంతా వాళ్లే నడిపిస్తున్నారు. సీక్వెల్స్ ట్రెండ్ వాళ్లు సెట్ చేసిందే మరి…
హీరోల ఆధారంగా సినిమాలపై హైప్ పెరిగే రోజులు పోయాయ్..దర్శకుడిని బట్టి హైప్ క్రియేట్ అవుతున్నాయి. కొన్నాళ్లుగా సూపర్ హిట్టవుతున్న మూవీస్ ని గమనిస్తే కంటెంట్ పరంగా సక్సెస్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు డైరెక్టర్స్ అంతా రూట్ మార్చారు. ఒకే కంటెంట్ ని పార్ట్స్ గా చెప్పడం కొత్త ట్రెండ్ అయ్యింది. ఇదే సమయంలో సీక్వెల్ మూవీలకు క్రేజ్ పెరుగుతోంది. ఎప్పటి నుంచో ఈ ట్రెండ్ ఉన్నప్పటికీ బాహుబలితో రీ స్టార్ట్ అయింది…ఇప్పుడు జోరందుకుంది. ఫస్ట్ పార్ట్ హిట్ అయితే చాలు సెకండ్ పార్ట్ కు రెడీ అవుతున్నారు. ఇప్పటికే బహుబలి, కేజీయఫ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటడంతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో కుమ్మేశాయి. పుష్ప ఫస్ట్ పార్ట్ సూపర్ సక్సెస్ అందుకుంది ..త్వరలో సెకెండ్ పార్ట్ వచ్చేస్తోంది.
ఇవన్నీ రెండు పార్టులే
సలార్, హరిహరవీరమల్లుతో పాటూ రీసెంట్ గా దేవర కూడా రెండు పార్టులుగా వస్తుందని అనౌన్స్ చేశారు. వీటితో పాటూ… అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ, బుచ్చిబాబు రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఆర్సీ 16 కూడా రెండు పార్టులుగా రాబోతుందట. అటు తమిళంలోనూ చాలా సినిమాలు ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నాయి. ధనుష్ కథానాయుకుడిగా నటిస్తోన్న కెప్టెన్ మిల్లర్
కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
ఒకే కథను విడదీసి చెప్పడం ఎందుకు
సినిమాను మొదలు పెట్టినప్పుడు మేకర్స్ ఒక బడ్జెట్ ను ఫిక్స్ చేసుకుంటారు. తీరా షూటింగ్ కంప్లీట్ అయ్యే సమయానికి బడ్జెట్ పెరిగిపోతోంది. దీంతో పెట్టిన పెట్టుబడి రాబట్టుకునేందుకు మేకర్స్ రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు..మంచి కథకు సంపూర్ణంగా న్యాయం చేసేందుకు కూడా ఇలా సీక్వెల్స్ కి మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. కథను కుదించాల్సిన అవసరం లేదు, లాభాలు కూడా వస్తున్నాయి.. దీంతో మేకర్స్ అంతా రెండు భాగాలుగా కథను తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఏదేమైనా సీక్వెల్స్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి