ఎల్బీనగర్ టిక్కెట్ ను మధుయాష్కీకి కాంగ్రెస్ హైకమాండ్ కేటాయించింది. మధుయాష్కీకి అసలు ఎల్బీనగర్ కు సంబంధమే లేదు. ఆయన ఒక్క సారి మాత్రం నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు. దాంతో ఆయన ఈ సారి హైదరాబాద్ పై గురి పెట్టారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. రాహుల్ గాంధీకి దగ్గర కావడంతో ఆయన టిక్కెట్ ను ఖరారు చేసుకున్నారు.
ఎల్బీనగర్ లో సుధీర్ రెడ్డి పార్టీ మార్పుతో నిర్వీర్యమైన కాంగ్రెస్
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది. 2014 నుంచి ఇక్కడి రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇక్కడ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున ఆర్ కృష్ణయ్య గెలిచారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ముద్దగోని రాంమోహన్ గౌడ్ ఓటమిపాలయ్యారు. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న ముద్దగోని రాంమోహన్ గౌడ్ ఓడిపోయారు. అయితే కొద్దిరోజులకే సుధీర్ రెడ్డి కూడా కారెక్కారు. ఫలితంగా కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా మారింది. నడిపించే నాయకుడే పార్టీ మారటంతో…. డైలామా పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా పార్టీ అక్కడ పూర్తిగా నిర్వీర్యమైపోయింది.
టిక్కెట్ల కోసం పలువురు పోటీ
సుధీర్ రెడ్డి పార్టీ మార్పు తర్వాత… ఇక్కడ మల్ రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్ రెడ్డి రాంరెడ్డి పార్టీ వ్యవహారాలను చూసుకున్నారు. స్థానిక నేతగా పేరున్న స్థానిక నేతగా పేరున్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి యాక్టివ్ గా పని చేశారు. ఈ సారి టికెట్ తమదే అన్న ధీమాలో ఇద్దరు నేతలు కూడా ఉన్నారు. అయితే మధుయాష్కీ గౌడ్…. ఎంట్రీ ఇచ్చారు. వ గతంలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు మధుయాష్కీ. అయితే ఇదే స్థానం నుంచి 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం కాస్త సైలెన్స్ గా ఉన్న మధుయాష్కీ… నిజామాబాద్ విషయంలో డైలామాలో పడిపోయారు.
ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ముద్దగోని రాంమోహన్ గౌడ్ కూ హ్యాండ్
రెండు సార్లు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన ముద్దగోని రాంమోహన్ గౌడ్ ను.. రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందటే పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకూ టిక్కెట్ ఆఫర్ ఇచ్చారు. చీకా మధుయాష్కీకే టిక్కెట్ ప్రకటించారు. దీంతో ఆయన కూడా మళ్లీ సొంత గూటికే వెళ్లిపోయే అవకాశం ఉంది. మధుయాష్కీ అయితే ఓడిపోతారని సర్వే నివేదికలు ఉన్నా… ఆయనకే టిక్కెట్ ఇవ్వడంతో ఎల్బీనగర్ పై కాంగ్రెస్ ముందే ఆశలు వదులుకున్నట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.