ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం పై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్దాయిలో విమర్శలు చేసింది. జగనన్నకు చెప్పుకోవటం అంటే,చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లేనని బీజేపీ నాయకులు సత్యకుమార్ కామెంట్స్ చేశారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం వలన ఎటువంటి ప్రయోజనం ఉండే పరిస్దితులు కనిపించటం లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన తీరు పై ఆయన మండిపడ్డారు. జగనన్నకు చెప్పుకోవడం, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం రెండూ ఒకటేనని అన్నారు. జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నెంబర్ డయల్ చేస్తే, జగనన్న చెప్పే అబద్ధాలు మెసేజ్ ల రూపంలో వస్తాయని సత్యకుమార్ తెలిపారు. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప, సమస్యల పరిష్కారం ఉత్తిమాటేనని సత్యకుమార్ విమర్శించారు. జగనే నే అసలు సమస్య అయినప్పుడు, ఇక జగన్‌కు చెబుదాం అనేది అర్థరహితమని అన్నారు.
చార్జిషీట్‌ల ఉద్యమంపై మైక్రో లెవల్ అబ్జర్వేషన్
ఛార్జిషీట్ ల ఉధ్యమానికి మైక్రోలెవల్ అభ్జర్వేషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని భారతీయ జనతా పార్టి రాష్ట్ర అద్యక్షుడు సొము వీర్రాజు అన్నారు. 5000వేల శక్తి కేంద్రాల్లొ బిజెపి నేతల పర్యటనలు ప్లాన్ చేస్తున్నామని సోమువీర్రాజు వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వం పై ఛార్జిషీట్ల ఉధ్యమానికి గ్రామస్ధాయిలో అభియోగాల నమోదుకు భారతీయ జనతాపార్టీ శ్రేణులు కదంధం తొక్కుతున్నాయని ఆయన చెప్పారు.. ప్రాంతాల వారీగా సమస్యలను గుర్తించడంతో పాటు ఆధారాల సేకరణలో బిజెపి నాయకత్వం తలమునకలై ఉందన్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టి చార్జ్ షీట్ ల కార్యక్రమంలో వేగం పెంచిందని, అందుకు అనుగుణమైన మైక్రోలెవెల్ అబ్జర్వేషన్ పెంచామని అన్నారు. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ఉధ్యమాన్ని షురూ చేయడంతో బిజెపి ఆయా జిల్లాల నాయకత్వాలు అసెంభ్లీ స్ధాయి నాయకత్వానికి పని విభజన చేయడంతో గ్రామాల వారిగా అభియోగాల స్వీకరణ కు ప్రజల వద్దకు నేరుగా వెళుతున్నారని చెప్పారు.
భారీగా వెలుగులోకి వస్తున్న వైసీపీ నిర్వాకాలు
నాలుగు పోలింగ్ కేంద్రాలకు ఒక శక్తి కేంద్రంగా బిజెపి పార్టీ కార్యక్రమం రూపొందించుకుంది. అందుకు అనుగుణంగా 5000 శక్తి కేంద్రాల్లో బిజెపి నేతలు పర్యటనలు నిర్వహించారు.విజయవాడ వన్ టౌన్ లో బిజెపి శ్రేణులు కాలనీల్లో పర్యటించి అభియోగాలు నమెదు చేసారు. ఈ సందర్భంగా కార్పోరేషన్ సమస్యల పై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. శానిటేషన్ కు సంబందించిన ఫిర్యాదులు కూడా బిజెపి నాయకత్వానికి వచ్చాయి. ఉత్తరాంధ్ర, రాయల సీమ దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా అభియెగాలను స్వీకరించారు.అ రసవల్లిలో కేంద్రం నిధులను దారిమళ్లించిన సంఘనలు ఉన్నాయని బిజెపి నేతలు ప్రకటించారు. అదేవిధంగా నెల్లిమర్లలో అధికార పార్టీ వైసీపి నేతలు అవినీతికి పాల్పడిన సంఘటనలు బిజెపి నేతలకు సమాచారం అందించి. భీమవరం సమీపంలోని పాలకోడేరులో ఎస్సీ కాలనీల్లో పేరుకుపోయిన సమస్యల పై భారతీయ జనతా పార్టి నాయకులు అభియోగాలు నమోదు చేశారు.ఉభయగోదావరి జిల్లాల్లో వ్యవసాయశాఖ, సివిల్ సప్లైయ్ అధికారుల వల్ల సమస్యలు ఉన్నాయని రైతాంగం భారతీయ జనతా పార్టి నేతలు ద్రుష్టికి తీసుకుని వచ్చాయి. రాయల సీమలో అన్నమయ్య డ్యాం కు సంబందించిన సమస్య పై ఇప్పటికే బిజెపి కోర్టులో కేసు వేసింది. అదేవిధంగా బద్వేలు తదితర ప్రాంతాల్లో సమస్యల పై బిజెపి నేతలు అభియోగాలు నమోదు చేశారు.