ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన విజయాలు, ఏపీకి చేసిన మేళ్లపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణను బీజేపీ ఈ రోజు నుంచి అమలు చేయనుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్థన్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేకంగా ప్రచా ర కమిటీ ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసింది. ప్రధాని మోడీ బాధ్యతలు చేపట్టిన మే 30 నుంచి జూన్ 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తొమ్మిదేళ్ల దేశ అభివృద్ధిని ప్రజల ముందు ఉంచనున్న బీజేపీ
ప్రధా నంగా దేశం సాధించిన పురోగతి, అంత ర్జాతీయ స్థాయిలో దేశానికి వచ్చి న పేరు ప్రతిష్టలు, ఏపీకి వివిధ ప్రాజెక్టుల రూపంలో ఇచ్చి న రూ.లక్షల కోట్ల సా యం వంటి పలు అం శాలను ప్రజల్లోకి తీసు కెళ్లనున్నారు. శక్తి కేం ద్రాల స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడంతో పా టు జిల్లా, రాష్ట్ర స్థాయి లో వివిధ రూపాల్లో ప్ర త్యేక కార్యక్రమాలు చేపడతారు. ఇప్పటికే కేంద్ర మంత్రి భగవంత్ ఖూబా ఏపీకి వచ్చారు. పలువురు కేంద్ర నాయకులుకూడా వచ్చే నెల రోజుల్లో రానున్నారు.
వైసీపీ సర్కార్ వైఫల్యంపై పోరాటం !
వైసీపీ సర్కారు వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండ గట్టేందుకు జిల్లాల వారీగా బీజేపీ కార్యాచరణ రూపొందించుకుంది. ఓ వైపు ప్రభుత్వ వైఫల్యాల ను ఎండగడుతూనే..రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాని మోడీ పాత్రను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైఫ ల్యాలు, ప్రజా ప్రతినిధుల అవినీతిపై చార్జిషీటు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పలు జిల్లాల్లో ప్రజలను భాగస్వాములను చేసి అభి యోగపత్రాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాల్లో ఉన్న కేంద్ర నిధులు.. వాటిని కేంద్రం దారి మళ్లిస్తున్న వైనం గురించి ప్రజలకు వివరించనున్నారు.
ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్న బీజేపీ !
ఓ వైపు మోదీ పాలనా విజయాలు..మరో వైసీపీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఎన్నికలకు బీజేపీ సిద్దమవుతోంది. కొద్ది రోజుల కిందట 26 జిల్లాలకు కొత్త ఇన్‌చార్జిల నియామకం పూర్తి చేశారు. వీరికి పలు కీలక బాధ్యతలను అప్పచెప్పారు. సంస్థాగతంగా కీలక బాధ్యతల్ని .. నేతలకు అప్పగించారు. ఎవరికి వారు తమ స్థానాల్లో బీజేపీని బలోపేతం చేయాలని సూచించారు. వీరందర్నీ సమన్వయం చేసి..ఇంటింటికి బీజేపీని తీసుకెళ్లేందుకు విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో ప్రచార కమిటీ తీవ్రంగా శ్రమిస్తోంది.