మిర్యాలగూడ రాజకీయాల్లో చివరి క్షణంలో ట్విస్టులు ఖాయం – కాంగ్రెస్‌కు షాకివ్వనున్న జానారెడ్డి !

ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో జానారెడ్డితి ప్రత్యేక శైలి. అయితే ఇప్పుడు ఆయన తన పూర్వ వైభవాన్ని కోల్పోయారు. నాగార్జున సాగర్ తో పాటు మిర్యాలగూడ నియోజకవర్గాన్ని తన సొంత ఆస్తిగా భావిస్తూ ఉంటారు. తాను చెప్పిన వారికి తప్ప ఇతరులకు టిక్కెట్ ఇచ్చేందుకు అంగీకిరంచడం లేదు. దీంతో అక్కడ కాంగ్రెస్ నేత.. బీజేపీతో చర్చల్లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించగానే ఓ కీలక నేత బీజేపీలో చేరి పోటీచేయనున్ారన్న టాక్ వినిపిస్తోంది.

మిర్యాలగూడులో బీజేపీకి క్యాడర్ ఎక్కువ

మిర్యాలగూడ నియోజకవర్గంలో బీజేపీకి మంచి బలం ఉంది. దండిగా క్యాడర్, సభ్యత్వం ఉన్న ప్పటికీ సరైన నాయకుడు లేరు. ఆ కొరత తీరితే … అక్కడ బీజేపీ విజయం సాధించడడం సులువేనన్న అంచనాలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి త్వరలో ఓ కీలక నేత చేరబోతుని.. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని… సమయం చూసి చేరిపోతారని.. వచ్చే ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున అభ్యర్థి అని చెబుతున్నారు.

గతంలో బీజేపీతో చర్చలు జరిపిన జానారెడ్డి తనయుడు

మిర్యాలగూడ టికెట్ కోసం జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పీసీసీ వికలాంగుల సెల్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో పాటు బీఎల్ఆర్‌గా అంతా పిలిచే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ సీనియర్ లీడర్ వారసుడు రేసులో ఉండటంతో.. మిగిలినవారిలో గుబులు మొదలైంది. ఒకప్పుడు కాంగ్రెస్పార్టీకి కంచుకోటలాంటి మిర్యాలగూడలో జానారెడ్డికి గట్టి పట్టుంది. అందుకే ఆయన కొడుకుని కాదని టికెట్ తమదాకా వస్తుందా అన్న అనుమానంతో ఉన్నారు మిగిలిన నేతలు. అయితే జానారెడ్డి ఇద్దరు కుమారులకు టిక్కెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీగా లేదు. ఓ కుమారుడు నాగార్డున సాగర్ నుంచి పోటీ చేయబోతున్నారు. దీంతో మిర్యాలగూడలో మరో కుమారుడికి చాన్స్ లేనట్లే.

బీజేపీలోకి వచ్చేది ఎవరు ?

ఉమ్మడి జిల్లాలోని పార్టీ ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డిల మద్దతుతో టికెట్ ఆశిస్తున్నారు బీఎల్‌ఆర్‌. ఆయనొచ్చాకే మిర్యాలగూడలో బీజేపీ బలపడిందన్న భావనతో ఉన్న ఆయన టిక్కెట్ లేకపోతే బీజేపీలో చేరిపోవాలని డిసైడయ్యారు. ఇప్పటికే చర్చలు జరిపారు. ఇప్పుడు ఇద్దరిలో ఒకరికే టిక్కెట్ కాగ్రెస్ ఇవ్వగలుగుతుంది. కాంగ్రెస్ టికెట్ రాకపోతే ప్రత్యామ్నాయం చూసుకునే ఆలోచనలో ఉన్నారట బీఎల్‌ఆర్‌. ఒక వేళ బీఎల్ఆర్ కు టిక్కెట్ ఇస్తే. జానారెడ్డి కొడుకు.. బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.