తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చేసిన కేసీఆర్.. తాను ఎర్రకోటపై జెండా ఎగరేస్తానని దేశమంతా తెలంగాణ పథకాలు అమలు చేస్తానని ప్రకటిస్తూంటారు. ఆయన మాటలు కోటలు దాటుతూ ఉంటాయి కానీ చేతలు మాత్రం గడప దాటవు. ఇది బయట వారితో పాటు ఇంట్లో వారికి కూడా బాగా తెలుసు. అందుకే కేటీఆర్ బయటపడి పోయారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పడం లేదు. సంకీర్ణం వస్తుందని అంటున్నారు. కేటీఆర్ ప్రకటనతో ఒక్క సారిగా బీఆర్ఎస్ కామెడీ అయిపోయింది.
కేసీఆర్ మాటల్ని పరోక్షంగా కొట్టి పారేసిన కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి గా మార్చిన కేసీఆర్ దేశం మొత్తం దున్నేస్తామని చెబుతున్నారు. కానీ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నటికీ తన వాయిస్ లో కాన్ఫిడెన్స్ ను ఆయన ఎప్పుడూ తగ్గించరు. ఎర్రకోటపై జెండా ఎగరేస్తామని ధీమాగా చెబుతూంటారు. అయితే ఆయన కుమారుడు , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాత్రం అంత నమ్మకం ఉన్నట్లుగా లేదు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణమేనని.. అందులో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. చేనేతల దినోత్సవం సందర్భంగా కేటీఆర్ హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రసంగించారు. చేనేతలపై జీఎస్టీని తగ్గిస్తామని ఢిల్లీలో చెప్పేందకు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తందని .. తగ్గిస్తుందని నమ్మకంగా చెప్పలేకపోయారు. అలా చెబితే కామెడీ అయిపోతుందని అనుకున్నారేమో కానీ.. కేంద్రంలో సంకీర్ణం వస్తందని.. కేంద్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకమవుతుందని చెప్పుకొచ్చారు.
మహారాష్ట్రలో మాత్రమే తిరిగితే జాతీయ పార్టీనా ?
ప్రతీ ప్రాంతీయ పార్టీ లక్ష్యం పది సీట్లు సాధించి .. కేంద్రంలో చక్రం తిప్పాలనుకోవడమే. . తమ సీట్లే కీలకం కావాలని కోరుకుంటారు. కేటీఆర్ కూడా ఆ స్థాయిలోనే ఉన్నారు. కానీ బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చారు. అయినా ఆయన అదే ఆలోచల్లో ఉండటం మాత్రం బీఆర్ఎస్ నేతల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. ఏదో ఓ కూటమిలో చేరడం ఖాయం కాబట్టి మందే ఏ కూటమో చెప్పుకోవచ్చు కదా అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఏ కూటమిలో కీలకం అవుతామో ఆ కూటమిలో చేరుతారన్న వ్యూహం అమలు చేస్తున్నారు. మొత్తంగా ఎర్రకోటపై జెండా అనే ఆలోచనను కేటీఆర్ సీరియస్‌గా తీసుకోలేదన్నమాట.
కేటీఆర్‌పై విష్ణువర్ధన్ రెడ్డి సెటైర్లు
కేటీఆర్ మాటల్ని బట్టి ఆయన జాతీయ పార్టీపై ఆయన పూర్తిగా నమ్మకం కోల్పోయారని అర్థం అవుతుంది. తండ్రి మీద.. సొంత పార్టీ మీద మీకే నమ్మకం లేకపోతే ఇక ప్రజలు ఎలా నమ్ముతారు కేటీఆర్ అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సెటైర్లు వేశారు. తండ్రి నీడలో .. అధికారం అండతో రాజకీయ నేతగా బలవంతంగా పేరు తెచ్చుకుంటున్న కేటీఆర్‌కు అధికారం పోయిన తర్వాత ఆయన నాయకత్వ లక్షణాలు అసలు ఏమీ లేవని బయటపడుతుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.