కేటీఆర్ ఫ్లైఓవర్ డ్రోన్ షాట్స్ పబ్లిసిటీ వానల పాలు – పోయిన ప్రాణాలకు ఎవరిది బాధ్యత ?

హైదరాబాద్ విదేశాల్లో ఉన్న సిటీల మాదిరిగా అభివృద్ధి చెందిందని …మాదాపూర్ లో డ్రోన్ షాట్స్ తీసి ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ కు ఓ మాదిరి వర్షాలు కూడా నిజాల్ని బయట పెట్టేస్తున్నాయి. ఎప్పుడు వర్షాలు పడినా హైదరాబాద్ ప్రజలు నరకం చూస్తున్నారు. ఇళ్లు మునిగిపోవడం పాత సంగతి ఇప్పుడు అపార్టుమెంట్లు మునిగిపోతాయి. రోడ్ల మీద నుంచి నీరు పక్కకుపోవడం లేదు. ఈ పరిస్థితి చూసి ఇది విశ్వనగరమా అనుకోవాల్సి వస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హైదరాబాద్ కష్టాలు

హైదరాబాద్ ను న్యూయార్క్ ను మించి అభివృద్ధి చేశామని ఆయన ఇటీవలి కాలంలో చెబుతున్నారు. మాదాపూర్ లో నాలుగు ప్రైవేటు ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు…. ఫ్లైఓవర్ల డ్రోన్ షాట్లతో ఇలా ప్రచారం చేసుకుంటున్నారని.. అసలు వాస్తవం మాత్రం ఎలా ఉందనేది వర్షం పడినప్పుడు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఓ మాదిరి వర్షం పడితేనే నరకం కనిపిస్తోంది. కారణం ఏదైనా డ్రైనేజ్ వ్యవస్థ … సిటీ అవసరాలకు తగ్గట్లుగా మెరుగపడలేదు. పదేళ్లుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎలాంటి మెరుగదల లేదు. అపార్టుమెంట్లే మునిగిపోతున్నాయి.

మాటల్లోనే డ్రైనేజీ , నాలాల మెరుగుదల ఉత్తమాటే

హైదరాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థను సీమాంధ్ర పాలకులు నాశనం చేశారని చెబుతూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చి పదేళ్లు అయింది. హైదరాబాద్ మొత్తాన్ని అభివృద్ధి చేసేశాం అని చెబుతున్నారు. కానీ డ్రైనేజీలను.. నాలాలను మాత్రం బాగు చేలేదు. హైదరాబాద్
రియల్ ఎస్టేట్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. జనాభా పెరిగిపోయారు. వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. వర్షం పడితే నీరంతా రోడ్ల మీదే ఉంటోంది. దీంతో ట్రాఫిక్ నరకం కనిపిస్తోంది. చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. డ్రైనేజీ నిర్వహణ అత్యంత దారుణంగా ఉండటం కారణంగా ప్రాణాలు గతంలో ఇలాంటి ఘోరాలు జరిగాయి. అప్పట్లో నాలాలను విస్తరిస్తామని.. వాటిని కబ్జా చేసిన వారిని వదిలి పెట్టబోమని ప్రకటించారు. అవన్నీ ఉత్తుత్తి ప్రకటనలే అయ్యాయి.

బీఆర్ఎస్ నేతల రియల్ ఎస్టేట్ తో మరింత ఘోరం

రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టారీతిన వెంచర్లు వేసి… కనీస నిబంధనలు పాటించకుండా… నిర్మాణాలు చేస్తున్నారు. అవి చేస్తోంది అధికార పార్టీ నేతలే. మొత్తంగా ఈ వ్యవహారాలన్నీ కేటీఆర్ పై విమర్శలకు కారణం అవుతున్నాయి. అతి పబ్లిసిటీని చూసిన వారంతా ఇప్పుడు కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ కురవనంత వర్షాలేమీ కాదు. అయినా ఎడెనిమిది మంది ప్రాణాలు పోయాయి. పెద్ద ఎత్తున ఇళ్లు నీట మునిగాయి. స్పందించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి