అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేటీఆర్ సీఎం అవుతారని.. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి బీఆర్ఎస్ కోసం దేశమంతా పర్యటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు అనుకుంటూ వస్తున్నాయి. అయితే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కేసీఆర్ సీఎం అవుతారని తేల్చేశారు. నిజానికి బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆరే సీఎం అనే చర్చ రావడం కూడా కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది . ఎందుకంటే బీఆర్ఎస్ లో ఆయనే కింగ్. కానీ ఆయన తన వారసుడిగా కేటీఆర్ ను సీఎం చేయాలనుకుంటున్నారు… అది సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో పడిపోతోంది.
కేటీఆర్కు మరింత కాలం ఎదురు చూపులు
కేటీఆర్ కాబోయే సీఎం అనే నినాదం ఏడెనిమిదేళ్లుగా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండేళ్లకు కేసీఆర్ ప్లీనరీ నిర్వహించాలనుకున్నారు. అప్పుడే… కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయబోతున్నారన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఆషామాషీగా జరగలేదు. పై స్థాయి నుంచి వచ్చిన లీకుల మేరకే జరిగింది. అప్పట్నుచి ఏడేళ్లుగా కేటీఆర్ ఎప్పుడైనా సీఎం అవుతారంటూ ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. కేటీఆర్ కూడా బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆరే సీఎం అని చెబుతూంటారు. అయితే గెలిచిన తర్వాత తనను ప్రజలకు కోరుకున్నారని.. లేకపోతే ఎమ్మెల్యేలు కోరుకున్నారని అందుకే ముఖ్యమంత్రి పదవి చేపడుతున్నానని .. స్టేట్ మెంట్ ఇవ్వడానికి చాలా కాలంగా రెడీగా ఉన్నారు. రాజకీయాల్లో అధికారం చేతిలో ఉండి… ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సీఎం పొజిషన్ లో ఉండి కూడా ఇంత కాలం ఎదురు చూడటం కేటీఆర్ ఒక్కరి విషయంలోనే జరిగిందనుకోవచ్చు.
మళ్లీ గెలిచినా కేసీఆరే సీఎం అన్న కవిత
కేటీఆర్ సీఎం స్థాయి బాధ్యతలు నిర్వహిస్తారు. అధికారాన్ని చెలాయిస్తున్నారు… కానీ కుర్చీ మాత్రం ఇప్పటికీ కేసీఆర్ ఇవ్వడం లేదు. వచ్చే ఎన్నికల తర్వాత ఇస్తారా అంటే… నమ్మకం లేదనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ ఓడిపోతే … మరెవరు అన్న ప్రశ్న కూడా వస్తోంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని బీఆర్ఎస్ అనుకుంటోంది. అందుకే మళ్లీ కేసీఆర్ పేరునే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. మూడో సారి గెలిచిన తర్వాత ఆ చాయిస్ కేటీఆర్ కు ఇస్తారని అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
జాతీయ రాజకీయాల్లో చాన్స్ వస్తేనే ఢిల్లీకి కేసీఆర్ !
ముఖ్యమంత్రిగానే ఆయన బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం.. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రయత్నాలు చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం వస్తే అప్పుడు కేటీఆర్ కు బ్యాటన్ అందించి ఆయన ఢిల్లీకి పయనమయ్యే చాన్స్ ఉంటుంది. ఒక వేళ బీజేపీకో.. కాంగ్రెస్ కో పూర్తి మెజార్టీ వస్తే కేసీఆర్… తెలంగాణలో సీఎంగానే ఉటారని… పదవిని కేటీఆర్ కు ఇవ్వరని అంటున్నారు.
ముఖ్యమంత్రిగా తనదైన మార్క్ చూపించాలని కేటీఆర్ ఆరాటపడుతన్నారు వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితులన్నీ కలిసి రావాలని ఆయన గట్టిగా కోరుకుంటారనడంలో సందేహం లేదు.